ఏరో ఇండియా షోలో భారీ అగ్నిప్రమాదం! అగ్నికిలల్లో 300 కార్లు దగ్ధం!

బెంగుళూరు వేదికగా ఏరో ఇండియా షో జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఇందులో సూర్యకిరణ్ విమానాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వుంచి విన్యాసాలు చేస్తుంది.

 Fire Accident In Aero India Show In Bangalore-TeluguStop.com

ఇప్పటికే కొద్ది రోజుల క్రితం ఈ విన్యాసాలకి రిహార్సల్ చేస్తున్న సమయంలో ఓ విమానం కూలి ట్రైనీ ఫైలెట్ చనిపోయాడు.అయిన కూడా ఈ ఏరో ఇండియా షోని నిర్వహిస్తున్నారు.

ఇక ఈ ఏరో ఇండియా షోని చూడటానికి వేల సంఖ్యలో వీక్షకులు వస్తూ వుంటారు.తాజాగా ఈ ఏరో ఇండియా షో జారుగుతూ వుండగా గేటు నెంబర్ 5 దగ్గర భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

ఇక ఎలహంకలో ఏరో ఇండియా షో కోసం వచ్చిన వారి కార్లు వందల సంఖ్యలో పార్కింగ్ చేసి వున్నాయి.అయితే పార్కింగ్ చేసిన ప్రదేశంలో పచ్చిగా ఎండిపోయి వుండటంతో మాటలు వేగంగా వ్యాపించి కార్లని చుట్టూముట్టాయి.

ఈ ప్రమాదంలో మూడు వందలకి పైగా కార్లు కాలి బూదిధైపోయాయి.ఇక సంఘటన స్థలానికి పది ఫైర్ ఇంజన్స్ తో చేరుకున్న ఫైర్ సిబ్బంది మాటలని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

పార్కింగ్ లో వున్న ఓ కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని నిర్వాహకులు గుర్తించారు.ఈ ప్రమాదం కారణంగా ఏరో ఇండియా షోని వెంటనే నిలిపేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube