తెలంగాణ భవన్‌కు అగ్గి పెడుతున్న టీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం.. ?

తెలంగాణ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో ఒక్క పదో రౌండ్ మినహా మిగిలిన రౌండ్స్ అన్నీట్లోను టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ లీడ్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.ఈ ఫలితాలను బట్టి చూస్తే దాదాపుగా విజయం ఖాయం అయ్యినట్లుగా కనిపిస్తుండటంతో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలు పెడుతుంది.

 Fire Accident At Telangana Bhavan-TeluguStop.com

విజయోత్సవ ఊపు పరుగులు పెడుతుండగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు టపాకులు కాల్చారు.

దీంతో తెలంగాణ భవన్‌ లో మరో సారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

 Fire Accident At Telangana Bhavan-తెలంగాణ భవన్‌కు అగ్గి పెడుతున్న టీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కార్యకర్తలు కాల్చిన టపాసులు అక్కడే ఉన్న ఎండిన చెట్లపై పడటంతో భారీగా మంటలు చెలరేగాయట.ప్రమాదాన్ని పసిగట్టిన సిబ్బంది వెంటనే అప్రమత్తమైన మంటలు అదుపులోకి తెచ్చారట.అసలే మండిపోతున్న ఎండలకు చిన్న నిప్పు తోడైతే ఆ ప్రమాద తీవ్రత ఎంతలా ఉంటుందో తెలిసిందే.ఇకపోతే గతంలో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినప్పుడు టపాకులు పేల్చడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

మొత్తానికి టీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం తెలంగాణ భవన్‌కు అగ్గి పెడుతున్న గానీ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎప్పటికైనా ప్రమాదమే అని అనుకుంటున్నారట.

#Leading #Crackers #Fire Accident #Counting #TRS Candidate

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు