కెమికల్ ఫ్యాక్టరీలో మరో  అగ్ని ప్రమాదం… ఆందోళనలో ప్రజలు….  

Fire Accident At Chemical Factory In Kadapa - Telugu Chemical Factory, Fire Accident, Kadapa, Power Short Circuit

మొన్నటికి మొన్న విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ సంస్థలో జరిగినటువంటి కెమికల్ ప్రమాదం మరువక ముందే మరో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కడప పట్టణ శివార్లలో చోటు చేసుకుంది.

 Fire Accident At Chemical Factory In Kadapa

వివరాల్లోకి వెళితే స్థానిక పట్టణ శివార్లలో ఉన్నటువంటి ఓ కెమికల్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్ని ప్రమాదం సంభవించింది .

అయితే ఫ్యాక్టరీలో భారీ మంటలను చూసినటువంటి స్థానికులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి మంటలను ఆర్పే సిబ్బందికి సమాచారం  అందించారు.దీంతో అప్రమత్తమై నటువంటి సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు.

కెమికల్ ఫ్యాక్టరీలో మరో  అగ్ని ప్రమాదం… ఆందోళనలో ప్రజలు….-General-Telugu-Telugu Tollywood Photo Image

అలాగే సమాచారం అందుకున్న  సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, ఫ్యాక్టరీ యజమానులు ద్వారా పలు వివరాలు సేకరించి ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.కాగా అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ హాని జరగలేదనీ అధికారులు చెబుతున్నారు.

అయితే ఈ ప్రమాదంలో దాదాపుగా 85 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ అగ్ని ప్రమాదం కారణంగా కెమికల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

దీంతో పలువురు ప్రభుత్వ అధికారులు అప్రమత్తం అవుతూ ప్రజలకు ధైర్యం చెబుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test