వామనరావు దంపతుల హత్య కేసులో వారి పై ఎఫ్ఐఆర్ నమోదు.. నిందితులు ఎవరంటే.. ?

తెలంగాణ రాష్ట్రం ఉలిక్కిపడేలా జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్యల విషయంలో ఎన్నో సంచలన విషయాలు దాగున్నాయట.ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంలో సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.

 Fir Registered Against Three Persons In Vamana Rao Couple In Murder-TeluguStop.com

ఈ హాత్యకు కారణం తెలంగాణ ప్రభుత్వం అని విమర్శలు కూడా చేస్తున్నారు.ఇకపోతే నిన్న పెద్దపల్లి జిల్లా కవలచర్ల వద్ద ఈ హత్య జరిగిన విషయం తెలిసిందే.

కాగా వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో నిందితులుగా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 Fir Registered Against Three Persons In Vamana Rao Couple In Murder-వామనరావు దంపతుల హత్య కేసులో వారి పై ఎఫ్ఐఆర్ నమోదు.. నిందితులు ఎవరంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Fir Registered, Kumar, Kunta Srinu, Murder Case, Peddapalli, Three Members, Vamana Rao Couple, Vasanta Rao-Latest News - Telugu

అందులో ఏ1గా వసంతరావు, ఏ2గా కుంట శ్రీను, ఏ3గా కుమార్ లపై కుట్ర, హత్య అభియోగాలు మోపారు.వారిపై ఐపీసీ 120బి, 302, 341, 34 కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.అయితే ఈ హత్యకు ఈ స్థల వివాదమే కారణం కావొచ్చన్న విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు కొందరు అధికారపార్టీ నేతల హస్తం కూడా ఉందని ప్రచారం జరుగుతుంది.మరి నిజానిజాలూ పోలీసులు వెలికితీస్తే గానీ ఈ హత్యలో ఎవరెవరి హస్తం ఉందో తెలియదు.

అంతవరకు వేచి చూడవలసిందే.

#Three Members #Kumar #Vasanta Rao #Peddapalli #Kunta Srinu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు