ఈ మధ్య కాలంలో కొందరు సెలబ్రెటీలు అవగాహన లేకుండా చేసేటటువంటి పనుల కారణంగా చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు మరియు మోడల్ తన పుట్టిన రోజు సందర్భంగా గోవా లోని ఓ బీచ్ లో బట్టలు లేకుండా నగ్నంగా పరిగెత్తుతూ తీసుకున్నటువంటి ఓ ఫోటోని తన అధికారిక సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో పోలీసులు అతడిపై పలు చట్టాల కింద కేసు నమోదు చేసిన ఘటన ముంబైలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే తెలుగులో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించినటువంటి “సత్యమేవ జయతే” అనే చిత్రంలో విలన్ గా నటించిన బాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు మోడల్ మిలింద్ సోమన్ ఇటీవలే తన పుట్టిన రోజు కావడంతో ఒంటిపై నూలు పోగు లేకుండా గోవా బీచ్ లో పరిగెత్తుతూ తీసినటువంటి ఓ ఫోటోని తన అధికారిక ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. అంతేగాక ఈ ఫోటో కి “హ్యాపీ బర్త్ డే టూ మీ” అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ ఫోటో పై స్పందించిన కొందరు నెటిజన్లు సెలబ్రిటీ హోదా లో ఉన్నటువంటి ఓ వ్యక్తి ఇలా నగ్నంగా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
అంతేగాక అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
దీంతో తాజాగా మిలింద్ సోమన్ పై గోవా పోలీసులు పలు చట్టాల కింద కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా పంపించారు.
అయితే ఇలాంటి కేసులలో ఇరుక్కోవడం మిలింద్ సోమన్ కి కొత్తేమీ కాదు.గతంలో కూడా ఇలాంటి చర్యలకి పాల్పడి పోలీసు కేసులో ఇరుక్కున్నాడు. అయినప్పటికీ మిలింద్ సోమన్ ఏ మాత్రం మారకుండా ఇలా నగ్న ప్రదర్శనలు చేస్తున్నాడు.