వివాదంలో అమితాబ్ షో... కేసు నమోదు!

బాలీవుడ్ దిగ్గజం అమితాబచ్చన్ ప్రముఖ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న‘కౌన్ బనేగా కరోడ్ పతి’కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న విషయం తెలిసినదే.అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం మరో వివాదంలో చిక్కుకుంది.

 Fir Registered Against Amitabh Bachchan Show,  Amitabh Bachchan, Kbc12, Question-TeluguStop.com

ఈ కార్యక్రమంలో అమితాబచ్చన్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రశ్నలు అడిగారు అంటూ లక్నోకు చెందిన ఓ వ్యక్తి ఈ కార్యక్రమం పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

గత శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా కరమ్ వీర్ స్పెషల్ ఎపిసోడ్ లో సామాజికవేత్త బెజవాడ విల్సన్, నటుడు అనూప్ సోనీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ఎపిసోడ్ లో మొదటి నుంచి ప్రశ్నలు అడుగుతున్న అమితాబచ్చన్ కు ఎంతో చాకచక్యంగా సమాధానాలు చెబుతూ వచ్చారు.

Telugu Dr Br Ambedkar, Firregistered, Hindus, Kbc-Latest News - Telugu

ఇందులో భాగంగానే వీరిని రూ.6,40,000 ప్రైజ్‌మనీ ప్రశ్న అడిగారు.1927 డిసెంబర్ 25 న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఆయన అనుచరులు ఏ గ్రంథ పత్రాలను తగులబెట్టారు అని అడిగారు.ఆ ప్రశ్నకు సమాధానాలు గా ఏ) విష్ణు పురాణం బీ) భగవద్గీత సి) రిగ్వేద డి) మనుస్మృతి అని ఆప్షన్ లను ఇచ్చారు.

దీంతో ఆ కంటెస్టెంట్ ఎంతో అలవోకగా వారి సమాధానాన్ని కరెక్ట్ గా తెలియజేశారు.అయితే ఈ ప్రశ్న పై అమితాబచ్చన్ మాట్లాడుతూ కుల ‘వివక్ష, అస్పృశ్యతను పెంపొందించేలా ఉందనే కారణంతో మనుస్మృతిని’అంబేద్కర్ అతని అనుచరులు తగులబెట్టారని తెలియజేశారు.

దీంతో పలువురు నెటిజన్లు ఈ ప్రశ్నపై స్పందిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా అమితాబచ్చన్ మాట్లాడారని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.అంతేకాకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మరికొందరు ట్వీట్ కూడా చేస్తున్నారు.

ఈ సంఘటనపై బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ ‘కౌన్ బనేగా కరోడ్ పతి’నీ కమ్యూనిస్టులు హైజాక్ చేశారంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube