బాలీవుడ్ నటిపై ఎఫ్ఐఆర్ నమోదు.. కారణమేంటంటే?

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ పై ఎఫ్ ఆర్ ఐ నమోదయింది.రాఖీ సావంత్ కొన్ని వివాదాల్లో చిక్కుకుంది.

 Fir Against Rakhi Sawant And Her Brother Alleged Fraud-TeluguStop.com

తనపై, తన సోదరుడు పై, మరో వ్యక్తి పై ఓ కేసు నడుస్తుంది.దీంతో ఆమెకు తాజాగా ఎఫ్ ఆర్ ఐ నమోదు కాగా.

రాఖీ సావంత్ కు ఈ వివాదంలో ఎటువంటి సంబంధం లేదంటూ అనవసరంగా లాగుతున్నారంటూ.తన సోదరుడు రాకేష్ తెలిపాడు.

 Fir Against Rakhi Sawant And Her Brother Alleged Fraud-బాలీవుడ్ నటిపై ఎఫ్ఐఆర్ నమోదు.. కారణమేంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అసలు వీరిపైన ఈ కేసు నమోదు కావడానికి కారణమేంటంటే.

నవభారత్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.

శైలేష్ శ్రీ వాత్సవ అనే రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ తన స్నేహితుడు రాజ్ ద్వారా రాకేష్ ను కలిశాడు.దీంతో వీళ్లు బాబా గుర్ మీత్ రామ్ రహీం జీవితం ఆధారంగా సినిమా చేయాలనుకున్నారు.

అంతేకాకుండా ఓ డాన్స్ ఇన్ స్టిట్యూట్ కూడా ప్రారంభించాలని అనుకున్నారు.అయితే ఇక్కడ రాఖీ సావంత్ ఆ డాన్స్ ఇన్ స్టిట్యూట్ బాధ్యతలు తీసుకుంటుందని రాకేష్ తెలపగా.

రాకేష్, రాజ్ ఇద్దరు కలిసి శైలేష్ దగ్గర 6 లక్షలు తీసుకున్నారు.

తర్వాత తన దగ్గర తీసుకున్న ఆరు లక్షల మొత్తాన్ని ఏడు లక్షలు గా పోస్ట్ డేటెడ్ చెక్కును రాసిచ్చారు.

దీంతో అందులో తప్పు సంతకాలు ఉండటంతో చెక్ బౌన్స్ అయ్యింది.ఈ విషయాన్ని శైలేష్ ఢిల్లీలోని వికాస్ పురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కాగా ఈ కేసు 2017 నుంచి నడుస్తున్నప్పటికీ మళ్లీ కేసు వెలుగు లోకి వచ్చింది.ఇక ఈ విషయం గురించి రాకేష్ స్పందిస్తూ.

రాజ్ తో కలిసి తొలి యాక్టింగ్ ఇన్ స్టిట్యూట్ పెట్టినప్పుడు ఆ సమయంలో తన అమ్మ ఆరోగ్యం బాగా లేదని ఇక తను ముంబైలో ఉన్నానని తెలిపారు.ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లగా తల చెక్ బుక్ తో సహా మరిన్ని వస్తువులు కనిపించకపోయాయని తెలుపగా.

తన పార్టనర్ తనను మోసం చేశాడని అప్పుడు అర్థమైందని తెలిపాడు.ఈ విషయం గురించి తాను ఇదివరకే పోలీసులకు తెలుపగా.

ఈ కేసులో రాఖీ కి ఎలాంటి సంబంధం లేదని తనను అనవసరంగా తాగుతున్నారని చెప్పుకొచ్చాడు.తను ఈ కేసులో చట్ట పరంగా ముందుకు వెళ్తానంటూ తెలిపాడు.

#Rakhi Sawant #Shailesh #Rakesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు