కుక్కలా ఉన్నావ్ అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ పై ట్రోలింగ్..!

ఒకప్పుడు సోషల్ మీడియా లేని సమయంలో ఎటువంటి ట్రోలింగ్ సమస్యలు ఉండేవి కాదు.కానీ ఈ మధ్య తరచుగా నటీనటులు ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నారు.

 Fir Actress And Bigg Boss 14 Fame Kavita Kaushik Exposes Trolls Shares-TeluguStop.com

సోషల్ మీడియాలో నేటి జనులు ప్రతి ఒక్క స్టార్ లను తమకు ఇష్టం వచ్చినట్టు కామెంట్ లు పెడుతూ.వాళ్లను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు.

అంతేకాకుండా తమ నోటికి వచ్చినట్టు తిట్టి పారేస్తున్నారు.తాజాగా ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ పై కుక్కల ఉన్నావంటూ ట్రోలింగ్ ఎదురైంది.

 Fir Actress And Bigg Boss 14 Fame Kavita Kaushik Exposes Trolls Shares-కుక్కలా ఉన్నావ్ అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ పై ట్రోలింగ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ రియాలిటీ షో కంటెస్టెంట్ నటి కవితా కౌశిక్ గురించి అందరికీ తెలిసిందే.ఈమె హిందీ బిగ్ బాస్ 14 లో పాల్గొన్నగా.అందులో మరో కంటెస్టెంట్ లు రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా తో తరచుగా గొడవ పడటం తో వార్తల్లో బాగా నిలిచింది.అయితే ఆమె తాజాగా నేటి జనుల టార్గెట్ లో పడింది.ఆమెను కొందరు నెటిజనులు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా లో.’ నువ్వు కుక్క లా ఉన్నావంటూ’‌ వ్యతిరేక మాటలతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

దీంతో ఆమె మనస్తాపానికి గురై ముంబై పోలీసులకు, మహారాష్ట్ర సైబర్ సెల్ అధికారులకు ఆశ్రయించింది.తన పై అసభ్యంగా చేసిన నేట‌ి జనుల చాట‌్ లను స్క్రీన్ షాట‌్ తీసి వాట‌ిని పోలిసులకు చూపించింది.

వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది.ఇలా ఎంతో మంది నటులు ట్రోలింగ్ సమస్యలకు గురవడం కామన్ గా మారింది.

ఇదివరకే బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో తాము షేర్ చేసిన ఫోటోలకు నేటి జనుల నుండి విపరీతమైన కామెంట్ లు, ట్రోలింగ్ లకు ఎదురైన సంగతి తెలిసిందే.

#Kavitha Kaushik #Big Boss #Maharastra #Exposes Trolls

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు