ఔనా : భారత్‌లో కంటే పాక్‌, బంగ్లాలోనే సంతోషం ఎక్కువ... ఐక్యరాజ్య సమితి రిపోర్ట్‌  

Finland Tops World Happiness Rankings, India At 140th Place, Un-

పాకిస్థాన్‌లో ఎప్పుడు కూడా బాంబుల మోత, ఎప్పుడు ఎక్కడో ఒక చోట రక్తపు మరకలు కనిపిస్తూనే ఉంటాయి. అత్యంత ప్రమాదకర దేశంలో ఒక దేశంగా పాకిస్థాన్‌ నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలోని ప్రముఖ ఉగ్ర దేశాల జాబితాలో పాకిస్థాన్‌ ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది..

ఔనా : భారత్‌లో కంటే పాక్‌, బంగ్లాలోనే సంతోషం ఎక్కువ... ఐక్యరాజ్య సమితి రిపోర్ట్‌-Finland Tops World Happiness Rankings, India At 140th Place, UN

అయినా కూడా పాకిస్థాన్‌ ప్రపంచంలోని హ్యాపీ దేశాల జాబితాలో చోటు సంపాదించడం ఆశ్చర్యంగా ఉంది. అది కూడా ఇండియా కంటే అత్యంత ముందు స్థానంలో పాకిస్థాన్‌ ఉండటం ప్రపంచ దేశాలను కూడా విస్తు పోయేలా చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి పెద్ద ఎత్తున నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయాలు వెళ్లడి అయ్యాయి.

ఐక్యరాజ్య సమితి సర్వే ప్రకారం ప్రపంచంలో హ్యాపినెస్‌తో ఉన్న జాబితాలో ఇండియా 140వ స్థానంలో ఉంది. ఇండియాలోని ప్రముఖ నగరాల్లో కూడా జనాలు సంతోషంగా లేరని, అంతా కూడా వారి వారి ఉద్యోగాలు, బిజినెస్‌లు, కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్నట్లుగా వెళ్లడయ్యింది. పూర్తి సంతోషంగా ఉన్న వారిలో ఇండియా ర్యాంకు దారుణంగా ఉందని ఐక్యరాజ్యసమితి వెళ్లడించింది. ఇండియాలోని పూర్తి జనాబాలో 18 శాతం మంది మాత్రమే పూర్తి సంతోషంగా ఉన్నట్లుగా ఐక్యరాజ్య సమితి రిపోర్ట్‌లో వెళ్లడయ్యింది. అయితే పాకిస్థాన్‌లో మాత్రం ఈ నెంబర్‌ భారీగా ఉంది.

పాకిస్థాన్‌లో ఎప్పుడు బాంబులు పేలుతున్నా కూడా అక్కడ జనాలు చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతున్నట్లుగా ఐక్యరాజ్యసమితి రిపోర్ట్‌లో వెళ్లడయ్యింది. పాకిస్థాన్‌కు ఈ జాబితాలో 67వ స్థానం దక్కడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. పాకిస్థాన్‌ మాత్రమే కాకుండా చైనా మరియు బంగ్లాదేశ్‌లు సైతం ఇండియా కంటే తక్కువ స్థానాలను దక్కించుకున్నాయి. చైనా 93వ స్థానంలో ఉంటే, బంగ్లాదేశ్‌ మాత్రం 125వ స్థానంలో ఉంది. ఈ నెంబర్స్‌ ఐక్యరాజ్య సమితి ప్రముఖులను కూడా ఆశ్చర్య పర్చిందట. అగ్రరాజ్యం అయిన అమెరికా 19వ ర్యాంకును దక్కించుకుంది. చిన్న చిన్న దేశాలే ఎక్కువ సంతోషంగా ఉన్నట్లుగా ఈ సర్వేలో వెళ్లడయ్యిందని ఐక్యరాజ్య సమితి వారు అన్నారు.