‘‘ మీ జాతి వాళ్లతోనే డేటింగ్ చేసుకో’’.. సింగపూర్‌లో భారతీయుడిపై జాతి వివక్ష వ్యాఖ్యలు

కరోనా వైరస్ భూమ్మీద లక్షలాది మంది ప్రాణాలు తీయడంతో పాటు సామాజికంగా, ఆర్ధికంగా చేసిన నష్టం అంతా ఇంతా కాదు.కరోనా ముసుగులో జాతి వ్యతిరేకవాదులు రెచ్చిపోతున్నారు.

 Find Woman Of Your Race: Indian-origin Man Abused In Singapore Over Chinese-orig-TeluguStop.com

కోవిడ్ చైనీయుల వల్లే వచ్చిందంటూ అనేక దేశాల్లో వారిని లక్ష్యంగా చేసుకుని భౌతికదాడులకు పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలు.అమెరికాలో సైతం ఇదే కారణం చూపి ఆసియా సంతతి వారిపై కాల్పులకు సైతం తెగబడుతున్నారు.

గడిచిన రెండు, మూడు నెలల నుంచి ఈ తరహా ఘటనలు ఎక్కువవుతున్నాయి.ఈ నేపథ్యంలో సింగపూర్‌లో భారత సంతతి యువకుడిపై చైనీయుడు చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.భారత సంతతికి చెందిన దేవ్ ప్రకాష్ అనే వ్యక్తి చైనా మూలాలున్న యువతితో డేటింగ్ చేస్తున్నాడు.ఈ క్రమంలో వీరిద్దరూ జూన్ 5న ఈస్ట్ షాపింగ్ సెంటర్ జంక్షన్ సమీపంలోని వీలాక్ ప్లేస్‌లో కబుర్లు చెప్పుకుంటున్నారు.ఈ సమయంలో వారి వద్దకు వచ్చిన ఓ చైనా సంతతి యువకుడు.

తమ దేశానికి చెందిన యువతితో దేవ్ డేటింగ్ చేయడాన్ని తప్పుబట్టాడు.‘మీ జాతికి చెందిన వాళ్లతోనే నువ్వు రిలేషన్‌షిప్‌లో ఉండాలి’ అని వాగ్వాదానికి దిగాడు.

అలాగే చైనా యువతిని సైతం వదల్లేదు.నువ్వు ‘‘ ఒక భారతీయుడితో డేటింగ్ చేసినందుకు మీ తల్లిదండ్రులు గర్వపడతారు అనుకుంటున్నావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చైనా యువతులను భారతీయ పురుషులు వేటాడుతున్నారని మండిపడ్డాడు.

ఈ తతంగం మొత్తాన్ని సదరు యువతి తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసింది.

తొమ్మిది నిమిషాల నిడివి వున్న సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దేవ్.తామిద్దరం వేర్వేరు జాతులకు చెందిన వ్యక్తులమని.తాము ప్రేమించుకుంటున్నామనే ఉద్దేశంతో మమ్మల్ని ఒక వ్యక్తి బహిరంగంగా అవమానించాడని దేవ్ ఆవేదన వ్యక్తం చేశాడు.తాము ఏదో తప్పు చేసినట్లు ప్రశ్నిస్తున్నాడని.

వేర్వేరు మూలాలు ఉన్నప్పటికీ, తాము సింగపూర్ వాసులం కావడం గర్వకారణమన్నాడు.ప్రేమకు జాతి , మతం లేదని.

మనం ప్రేమించాలనుకునే వారిని ప్రేమించగలగాలి తప్ప.ఈ వీడియోలో ఉన్న వ్యక్తిలా మారకూడదని దేవ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Telugu Chinese, Covid, Dev Prakash, Singapore-Telugu NRI

అయితే ఈ వీడియో కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో, ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.“వేరే జాతికి చెందిన వారిని ప్రేమించే వారు జాత్యహంకారి అవుతారా?” అని మండిపడ్డారు సింగపూర్ హోం మంత్రి కె.షణ్ముగం.ఈ తరహా చర్యలు ఆమోదయోగ్యం కావని సహనం, సామరస్యానికి విలువ ఇచ్చే సింగపూర్‌ విలువ తగ్గిపోయే సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube