మీరు కొనే చేపలు తాజానో కాదో ఇలా తెలుసుకోండి..!

నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా ఇష్టపడే జాబితాలో చేపలు ప్రత్యేక స్థానంలో ఉంటాయని చెప్పాలి.చేపలను ఒకసారి రుచి చూస్తే చాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.

 Fish, Viral Latest, Viral News, Social Media, Fish Real, Check-TeluguStop.com

అయితే కొంతమంది చేపలు నీసు వాసన వస్తాయని, అలాగే చేపల్లో ముళ్ళు ఉంటాయని వాటిని తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపరు.కానీ మిగతా జీవులతో పోలిస్తే చేపలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

చేపల్లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది.అలాగే పోషక విలువులు కూడా అధికంగా ఉంటాయి.

చేపలు తినడం వలన గుండెకి ఎంతో మేలు జరుగుతుంది.అలాగే బీపీ, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి.

అందుకనే కనీసం వారానికి రెండు మూడు సార్లు అయిన చేపలను మీ ఆహారంలో భాగంగా చేసుకోండి.అయితే మీరు తినే చేపలు కూడా మంచిగా, ఫ్రెష్ ఉండాలి.

ఎందుకంటే నిల్వ ఉన్న చేపలను తింటే ఆరోగ్యం మాట దేవుడెరుగు లేనిపోని అనారోగ్యాలు వచ్చి పడతాయి.ఎందుకంటే ఈమధ్య తాగే పాల దగ్గర నుండి గుడ్డు, మాంసం, ఆకుకూరలు కూడా కల్తీ అవుతున్నాయి.

అందుకే మనం కొనుగోలు చేసే చేపలు కూడా మంచివేనా అని ఒకసారి పరిశీలించి తీసుకోండి.చేపలు తాజాగా ఉన్నాయా? లేదా అనే విషయాలు ఎలా తెలుస్తాయి అని ఆలోచిస్తున్నారా.? అయితే ఈ టిప్స్ పాటించి చేపలు తాజావా లేక నిల్వ ఉన్నవా అనే విషయాలు తెలుసుకోండి.

మీరు చేపలు కొనుగోలు చేయాలనీ మార్కెట్ కి వెళ్ళినప్పుడు ముందుగా మీరు చేయవలిసిన మొదటి పని ఏంటంటే చేపలను వాసన చూడడం అన్నమాట మీరు చేపలను వాసన చూసినప్పుడు అవి సముద్రపు నీటి వాసన కలిగి ఉన్నట్లయితే ఆ చేపలు తాజావి అని అర్ధం.

అలాకాకుండా ఆ చేపల నుంచి చెడు వాసన వస్తున్నట్లయితే అవి నిల్వ ఉన్న చేపలు అని అర్ధం చేసుకోవాలి.చేపలు తాజావో కావో తెలుసుకోవడానికి చేపల కళ్ళను పరిశీలినగా చూడండి.

చేప కళ్లపై తెల్లటి గీతలు ఉన్నాగాని, చేప కళ్ళు లోపలికి ఉన్నాగాని అవి తాజా చేపలు కావు.చేపల కళ్ళు ఎప్పుడూ ప్రకాశవంతంగా మిలమిల మెరుస్తూ, బయటకు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి.

చేపలలో మనం పరిశీలించాలిసిన మరొక విషయం ఏంటంటే చేపల ఆకారం.

Telugu Fish, Latest-Latest News - Telugu

తాజా చేపల శరీరం లోపల, బయట ఒకేలా గట్టిగా ఉంటాయి.అలా కాకుండా చేపలను పట్టుకున్నప్పుడు మెత్తగా ఉన్నట్లయితే అవి పాడైపోయిన చేపలని అర్ధం.అలాగే తాజాగా ఉన్న చేపల మాంసం చాలా శుభ్రంగాను, ముక్కలు గట్టిగాను, పింక్ కలర్ లో ఉంటాయి.

తెల్లగా పాలిపోయినట్లు చేప ముక్కలు ఉంటే అవి నిల్వ ఉన్న చేపలని అర్ధం.అలాగే చేపలు కొనుగోలు చేసేటప్పుడు చేపలకు ఉన్న మొప్పలను గమనించండి.చేపల యొక్క మొప్పల కింది భాగంలో ఉన్న చర్మం గులాబీ రంగులో ఉందో లేదో ఒకసారి పరిశీలించండి.ఇంకో విషయం ఏంటంటే.

చేపలను మీరు ఎప్పుడు కొనుగోలు చేసిన అవి బతికి ఉన్న చేపలు అయితే కొనండి.ఎందుకంటే అవి చాలా తాజాగా ఉండడంతో పాటు రుచి కూడా బాగుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube