దానయ్యకు భారంగా మారుతున్న 'RRR' బడ్జెట్ ?

ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 దానయ్యకు భారంగా మారుతున్న ‘rrr’ బడ్జెట్ ?-TeluguStop.com

ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.

 దానయ్యకు భారంగా మారుతున్న ‘RRR’ బడ్జెట్ ?-దానయ్యకు భారంగా మారుతున్న RRR’ బడ్జెట్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

డివివి దానయ్య ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండక పోయేది.కానీ కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.

అందుకే ఈ సినిమా అనుకున్న సమయానికి వచ్చే అవకాశాలు తక్కువుగా కనిపిస్తున్నాయి.

ఈ కారణంగానే డివివి దానయ్య తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

అప్పులపై వడ్డీ భారం పడి అది తలకు మించిన భారం అయ్యిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.దానయ్య ఈ సినిమా కోసం ఇద్దరు దగ్గర ఫైనాన్స్ తీసుకోగా ఇప్పుడు వారి దగ్గర నుండి ఒత్తిడి ఎదురవుతుందని వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా అనుకున్న సమయానికి రాకపోతే నిర్మాతకు ఇంకా ఒత్తిడి ఎదురయ్యే పరిస్థితి నెలకొంది.

Telugu Corona Effect On Rrr, Covid19, Danayya Under Pressure, Dvv Danayya, Finance, Financial Pressure, Financial Pressure On Rrr Producer, Heavy Budget Movie, Interests, Ntr, Rajamouli, Ram Charan, Rrr, Rrr Producer, Tollywood-Movie

ఇది ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇంకా కొద్దీ భాగం మాత్రమే బాలన్స్ ఉంది.రెండు పాటలు, కొద్దిగా ప్యాచ్ వర్క్ మాత్రమే ఉండడంతో కరోనా ఎప్పుడు తగ్గితే అప్పుడు షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో జక్కన్న ఉన్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒక విదేశీ భామ నటిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

#CoronaEffect #Rajamouli #DVV Danayya #COVID19 #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు