కరోనా సోకిన 337 మంది జర్నలిస్టులకు ఆర్ధిక సాయం..!

రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారిన పడిన 337 మంది జర్నలిస్టులకు రూ.59.30 లక్షలను అందించామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్పష్టం చేశారు.వీరిలో కరోనా పాజిటివ్ తేలిన 256 మంది జర్నలిస్టులకు 20 వేల రూపాయల చొప్పున రూ.51.20 లక్షలు అందించామని అన్నారు.ఇక హోం క్వారంటైన్‎లో ఉన్న 81 మంది జర్నలిస్టులకు 10 వేల రూపాయల చొప్పున 8.10 లక్షల రూపాయలు సాయంగా అందించినట్టు అల్లం నారాయణ చెప్పుకొచ్చారు.ఇలా 761 మంది జర్నలిస్టులకు 14 లక్షల 80 వేల రూపాయలు ఆర్ధిక సాయం జర్నలిస్టుల అకౌంట్‎లలో జమ చేసినట్టు అల్లం నారాయణ స్పష్టం చేశారు.

 Corona Infected Journalists, Telangana Media Acadamy, Allam Narayana, Financial-TeluguStop.com

కరోనా బారిన పడిన పాజిటివ్, హోం క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధృవీకరించిన మెడికల్ రిపోర్టులను మీడియా అకాడమీ కార్యాలయానికి పంపించాలని అల్లం నారాయణ సూచించారు.

జర్నలిస్టు మిత్రులు తమ వివరాలను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ వాట్సప్ నెంబర్ 8096677444 పంపాలని అన్నారు.మరిన్ని వివరాలకు మీడియా అకాడమీ మేనేజర్ లక్ష్మణ్ కుమార్ నెంబర్ 9676647807 కు సంప్రదించ వచ్చని అల్లం నారాయణ సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube