కేంద్రం నోరెత్తకుండా జగన్ చేస్తున్న తెలివైన పని ఇదే ?  

YS Jagan, Nirmala Sitharaman, Finance Minister Buggana Rajendranath Reddy, Pending Funds, Union Finance Minister, Buggana Rajendranath Reddy meets Nirmala Sitharaman -

ఏపీ ప్రభుత్వం విషయంలో కేంద్ర అధికార పార్టీ బిజెపి వైఖరి ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదు.ఒక సందర్భంలో వైసిపికి పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లుగా ఆ పార్టీ అధినాయకుల వ్యవహరిస్తూ ఉంటారు.

 Finance Minister Buggana Rajendranath Reddy Meets Nirmala Sitharaman

మరో సందర్భంలో జగన్ రాజకీయ ప్రత్యర్ధులకు మేలు చేస్తూ, ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు.దీంతో కేంద్ర బీజేపీ పెద్దల వైఖరి ఆ పార్టీ ఏపీ నాయకులకు కూడా అంతుబట్టని విధంగా ఉంది.

ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ జగన్ హవాకు బ్రేకులు పడే విధంగా వ్యవహరిస్తోంది.మొదట్లో జగన్ కు అన్ని విషయాల్లోనూ అనుకూలంగా వ్యవహరించినట్లుగానే కనిపించింది.

కేంద్రం నోరెత్తకుండా జగన్ చేస్తున్న తెలివైన పని ఇదే -Political-Telugu Tollywood Photo Image

కానీ ఇప్పుడు మాత్రం జగన్ ను ఇరుకున పెట్టి రాజకీయంగా ఏపీలో మైలేజ్ పొందాలనే అభిప్రాయంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.ఇదంతా ఇలా ఉంటే, కొద్ది రోజుల క్రితం విద్యుత్ కొనుగోళ్ల విషయంలో నిర్మల సీతారామన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

వైసీపీ కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది.

విద్యుత్ కొనుగోళ్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సీరియస్ గా కామెంట్ చేయడంతో, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిర్మల సీతారామన్ ను స్వయంగా కలుసుకుని విద్యుత్ కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది అనే విషయాలను ఆధారాలతో సహా చూపించి, ఆమెకు వివరణ ఇచ్చారు.

దీంతో ఆ విషయంపై బీజేపీ నోరెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది.ఇదే తరహాలో మిగతా అన్ని శాఖలకు సంబంధించిన సమగ్రమైన సమాచారం కేంద్రంలో ఆయా శాఖల మంత్రులకు స్వయంగా చూపించడంతో పాటు, తాము ఎక్కడా తప్పు చేయడం లేదనే విషయాన్ని గట్టిగా చెప్పుకుని బిజెపి తమపై ఎటువంటి విమర్శలు చేయకుండా అడ్డుకోవాలని చూస్తోంది.

ఈ విషయాలను జాతీయ మీడియాలో కూడా హైలెట్ అయ్యే విధంగా చేసుకుని లబ్ధి పొందాలనే అభిప్రాయంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు అన్ని శాఖల్లోనూ ఇప్పటి వరకు అమలైన, తీసుకున్న నిర్ణయాలపై సమగ్రమైన రిపోర్టును తయారు చేసే పనిలో ఉన్నారట.త్వరలోనే ఏపీ మంత్రులు ఢిల్లీకి వెళ్లి సంబంధిత శాఖల మంత్రులను కలిసి, అన్ని విషయాలపైన క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.ఇదే జరిగితే వైసీపీ రాజకీయంగా బీజేపీపై పైచేయి సాధించడంతో పాటు, తాము పారదర్శకమైన పాలన చేస్తున్నామని, దానికి సంబంధించిన అన్ని ఆధారాలు బిజెపి ప్రభుత్వానికి సమర్పించామని గొప్పగా చెప్పుకునేందుకు వైసిపి సిద్దమవుతున్నట్టుగా కనిపిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Finance Minister Buggana Rajendranath Reddy Meets Nirmala Sitharaman Related Telugu News,Photos/Pics,Images..