‘ఉత్తమ విలన్‌’ ఆట షురూ

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ నటించిన తాజా చిత్రం ‘ఉత్తమ విలన్‌’.గతంలో కమల్‌ హాసన్‌ నటించిన ఏ సినిమాకు కూడా రాని ఆర్థిక ఇబ్బందులు ఈ సినిమాకు వచ్చాయి.

 Finally, Uttama Villain Movie Released Today-TeluguStop.com

ఈ సినిమా విడుదల చివరి నిమిషంలో వాయిదా పడటం జరిగింది.నిన్న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రావాల్సి ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రేక్షకులు థియేటర్ల వద్ద ‘ఉత్తమ విలన్‌’ సినిమా చూసేందుకు బారులు తీరారు.అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల వాయిదా పడ్డ విషయం తెల్సిందే.

అయితే ఎట్టకేలకు ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయినట్లుగా తెలుస్తోంది.నేడు మద్యాహ్నం నుండి సినిమా ప్రదర్శణ ప్రారంభం అయ్యింది.

నిన్న మొత్తం కూడా నిర్మాతకు మరియు ఫైనాన్సియర్స్‌కు మధ్య జరిగిన చర్చలు సక్సెస్‌ కాకపోవడంతో నేడు ఉదయం కూడా ఈ సినిమా విడుదల కాలేదు.ఎట్టకేలకు తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌ మరియు ‘మిర్చి’ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన యూవీ క్రియేషన్స్‌ సంస్థలు కలిసి ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకు వచ్చాయి.

ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవడంతో విలన్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇన్ని ఇబ్బందుల మధ్య వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనేది చూడాలి.

ఈ సినిమాలో హీరోయిన్స్‌గా పూజా కుమార్‌ మరియు ఆండ్రియాలు నటించారు.రమేష్‌ అరవింద్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube