చివరికి నితిన్ కి ఆ యాంకర్ దిక్కయ్యేలా ఉందిగా...

తెలుగులో ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి  ప్రారంభోత్సవ పనులను కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవలే పలువురు టాలీవుడ్ పెద్దల సమక్షంలో పూర్తి చేశారు.

 Nitin, Tollywood Young Hero, Anchor Anasuya, Tollywood, Andhadhun, Ileana, Tabu,-TeluguStop.com

అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా తొందరలోనే మొదలు కానున్నాయి.

కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది.

అయితే ఇంతకీ ఆ విషయం ఏంటంటే ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించేందుకు గాను ఇప్పటికే పలువురు హీరోయిన్లను సంప్రదించగా అందరూ నో చెప్పారట.కాగా ఈ లిస్టులో ముఖ్యంగా శిల్పాశెట్టి, టబు తదితర హీరోయిన్లు ఉన్నారు.

కాగా ఇటీవలే గోవా బ్యూటీ ఇలియానా ని కూడా సంప్రదించగా ఆమె కూడా మొహమాటం లేకుండా నో చెప్పిందట.

దీంతో చిత్ర యూనిట్ సభ్యులు చేసేదేమిలేక ఇక టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయని ఈ పాత్రలో నటించేందుకు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

దీంతో కొందరు నెటిజన్లు చిత్ర యూనిట్ సభ్యులు యాంకర్ అనసూయ తీసుకోవడంలో మద్దతు తెలుపుతున్నారు.ఇందుకు గల కారణాలను కూడా వివరిస్తూ కోట్ల రూపాయల్లో రెమ్యునరేషన్ ఇచ్చి ఇతర సినీ పరిశ్రమల హీరోయిన్లను పోషించడం కంటే మన తెలుగు నటీనటులను తీసుకోవడంతో కొంతమేర ఉపాధిని కూడా కల్పించినట్లు అవుతుందని అలాగే యాంకర్ అనసూయ కూడా తన పాత్రకి  తగ్గట్టుగా నటిస్తూ చక్కగా పాత్రలో ఒదిగి పోతుందని కాబట్టి యాంకర్ అనసూయ ఛాయిస్ బెస్ట్ అని అంటున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నితిన్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న టువంటి రంగ్ దే అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో లో నితిన్ కి జోడిగా మహానటి ఫిల్మ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు చిత్రీకరణ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube