మొత్తానికి భీష్మతో నితిన్ హిట్ కొట్టాడుగా...  

Finally Nithin Got A Victory With Bheeshma Movie - Telugu Bheeshma Collections News, Bheeshma Movie News, Bheeshma Movie Talk, Bheeshma Tollywood News, Nithin Latest Movie Bheeshma News, Nithin Movie News

చలో ఫేమ్ దర్శకుడు వెంకీ కుడుముల తాజాగా దర్శకత్వం వహించినటువంటి చిత్రం భీష్మ.ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటించారు.

Finally Nithin Got A Victory With Bheeshma Movie

అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.భారీ అంచనాల నడుమ శివరాత్రి పండుగ కానుకగా విడుదలైన టువంటి ఈ చిత్రం ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటోంది.

అంతేకాక ఇప్పటికే పలు థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.అయితే ఈ చిత్రంలో కృత్రిమ ఎరువులతో కాకుండా సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేస్తూ మంచి లాభాలను పండించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదని తెలిపే ఓ మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంగా “భీష్మ” ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేగాక పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో కలెక్షన్లకు పరంగా కూడా మంచి వసూళ్లను సాధిస్తోన్నట్లు తెలుస్తోంది.గత కొద్ది కాలంగా హిట్ కోసం పరితపిస్తున్నటువంటి నితిన్ “భీష్మ” చిత్రంతో దాదాపుగా హిట్ కొట్టినట్లే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే గతంలో నితిన్ నటించిన టువంటి చల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నితిన్ ని తీవ్రంగా నిరాశ పరిచాయి.

అయితే ప్రస్తుతం నితిన్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నటువంటి “రంగ్ దే” అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో నితిన్ సరసన మహానటి చిత్రంలో హీరోయిన్ కీర్తిసురేష్ నటిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Finally Nithin Got A Victory With Bheeshma Movie-bheeshma Movie News,bheeshma Movie Talk,bheeshma Tollywood News,nithin Latest Movie Bheeshma News,nithin Movie News Related Telugu News,Photos/Pics,Images..