నందిని రెడ్డికి హీరో దొరికాడు..!

అలా మొదలైంది, జబర్దస్త్, కళ్యాణ వైభోగమే కేఅలం మూడు సినిమాలతోనే దర్శకురాలిగా తనకంటూ ఓ క్రేజ్ సంపాదించిన నందిని రెడ్డి లాస్ట్ సినిమాతో హిట్ ఖాతాలో వేసుకున్నా తన డైరక్షన్లో చేసేందుకు హీరోలు ఎందుకో మొగ్గుచూపలేదు.నితిన్ కోసం ఓ అద్భుతమైన కథ రెడీ చేసిన నందిని రెడ్డి ఆ కథను నితిన్ కు వినిపించడం అతను ఆలోచిస్తా అని చెప్పడం అంతా జరిగింది.

 Finally Nandini Reddy Catched Her Hero For Next Movie-TeluguStop.com

అయితే నితిన్ ఎప్పటికి సినిమా చేస్తా అని గాని చేయనని గాని చెప్పకపోవడంతో అతన్ని వదిలేసి మరో హీరో వేటలో పడ్డది.

ఇక రీసెంట్ గా పెళ్లిచూపులు సినిమాతో ఊహించని విజయం అందుకున్న విజయ్ దేవరకొండ మీద కన్నేసిన నందిని తనకు సరిపడే కథను సిద్ధం చేసిందట.

ఎవడే సుబ్రమణ్యం తో ఎంట్రీ ఇచ్చి పెళ్లిచూపులు సినిమాతో ఓ రేంజ్ హిట్ అందుకున్న విజయ్ అంటే ఇప్పుడు అందరి దర్శకులకు ఫస్ట్ ఆప్షన్ అయ్యాడు.అందుకే నందిని ముందే ఖర్చీఫ్ వేసేసింది.

ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయట.కళ్యాణ వైభోగమే హీరోయిన్ మాళవికా నాయరే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుందని టాక్.

సో నందిని రెడ్డి సినిమా అంటే విజయ్ అకౌంట్లో మరో హిట్ పడ్డట్టే మరి.కుర్రాడి స్పీడ్ చూస్తుంటే కుర్ర హీరోలకు షాక్ ఇచ్చేలానే ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube