పూర్తి ఆరోగ్యంతో ఊర్లో అడుగు పెట్టిన గంగవ్వ.. మళ్లీ షో స్టార్ట్‌

తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ప్రత్యేక కంటెస్టెంట్ గా నిలిచిన గంగవ్వ ఐదు వారాల పాటు తన జర్నీ కొనసాగించారు.ఆమె ప్రత్యేకంగా ఎలా అయితే హౌస్ లోకి ఎంటర్ అయ్యిందో అంతే ప్రత్యేకంగా బయటకు వచ్చేసింది.

 Finally Gangavva Reached Her Village And Home, Bigg Boss4 Contestant Gangavva, G-TeluguStop.com

ఎలిమినేషన్ కి నామినేషన్ కాకుండానే ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండానే బయటకు వచ్చేసింది.బిగ్ బాస్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందిన గంగవ్వ అనారోగ్య కారణంతో బయటకు వచ్చేసింది.

అంతకు ముందే రెండు వారాలుగా కరోనా నేపథ్యంలో గంగవ్వ క్వారెంటైన్‌ లో ఉన్న విషయం తెలిసిందే.అంటే మొత్తం ఏడు వారాల పాటు ఆమె గ్రామానికి దూరంగా ఉంది.

ఎట్టకేలకు మొన్న అంటే మంగళవారం నాడు ఆమె తన గ్రామమైన లంబాడిపల్లి కి చేరింది.బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత ఆమెను రెండు రోజులు నిర్వాహకులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం జరిగింది.

ఆమె ఆరోగ్యం బాగుందని నిర్ణయానికి వచ్చిన తర్వాత స్వయంగా నిర్వాహకులు కార్‌ లో ఆమెను తీసుకెళ్లి ఇంటి వద్ద వదిలిపెట్టారు.సాధారణంగా అయితే హైదరాబాదులో ఉంటే ఎంతో మంది మీడియా వారు ఆమె ఇంటర్వ్యూ కి కోరేవారు.

కానీ ఆమె పల్లెకు వెళ్లడంతో మై విలేజ్ షో టీమ్‌ ఆమెతో ఇంటర్వ్యూ చేసి విడుదల చేశారు.రాజు మరియు గంగవ్వ ల సరదా బిగ్‌ బాస్‌ ముచ్చట్లు ఇంటర్వ్యూ ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవుతుంది.

ఆ ఇంటర్వ్యూలో గంగవ్వ ని చూస్తుంటే మళ్ళీ ఆమె పునరుత్తేజం తో మై విలేజ్ షో లో నటించే అవకాశం ఉందని అనిపిస్తుంది.గంగవ్వ ఈ వయసులో బిగ్‌ బాస్‌ హౌస్‌ లో 5 వారాలు ఉండటం అంటే మామూలు విషయం కాదు.

ఆమె మొత్తంగా ఈ వయసులో ఏడు వారాల పాటు కుటుంబానికి దూరంగా ఉందంటే ఆమె గట్టి గుండెకు హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube