త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్!  

Finally Actor Simbu Getting Married..?-simbu\\'s Marriage,str,t Rajender Son

తమిళ ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గురించి చెప్పాలి అంటే ముందుగా చెప్పే పేరు శింబు. శింబు పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే తారలు నయనతార,హన్సిక. ఎందుకంటే వీరిద్దరి తో బాబు మంచి కధలు నడిపారు..

త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్!-Finally Actor Simbu Getting Married..?

నయన్ సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో అయితే శింబు తో ఒక్కరేంజ్ లో ప్రేమాయణం నడిపింది. ఆ తరువాత ఏమి జరిగిందో ఏమో గానీ బ్రేకప్ కూడా చెప్పేసిందిలెండి. ఆ తరువాత శింబు ఏమి ఖాళీ గా ఉండలేదు ఈ లోపు బ్యూటిఫుల్ హీరోయిన్ హన్సిక తో ప్రేమాయణం నడిపాడు.

ఒకదశ లో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు అన్న వార్తలు ఇండస్ట్రీ లో గుప్పుమన్నాయి కూడా. వారిద్దరూ కలిసి చాలా సినిమాలలో కూడా చేసారు. కానీ ఆమెకు కూడా ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడం తో ఈ సారి ఆ ఎఫక్ట్ శింబు కెరీర్ పై కూడా పడింది.

కొంత బ్రేక్ తీసుకున్న శింబు మళ్లీ ఇపుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతగాడు నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్‌గా శింబు గారి సోదరుడు కురళరసన్‌కు పెళ్లై పోయింది. అయితే ఇది ఇప్పుడు శింబు వంతు వచ్చిందట.

ఇంకా ఎన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఈ విధంగా ఉంటాడు అని శింబు ఇంట్లో వాళ్ళు సంబంధాలు కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది. మరోపక్క ఇప్పటికే వాళ్ల చుట్టాల అమ్మాయితోనే శింబు పెళ్లి ఫిక్స్ అయ్యింది అన్న వార్తలు కూడా హల్ చల్ చేస్తుండడం తో నయన్ మాజీ లవర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. మరి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ శింబు ఇక పెళ్లి చేసుకోక తప్పేలాలేదు..