2023 సంక్రాంతి ఫైట్ ఎంత రసవత్తరంగా ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చిరు, బాలయ్య వంటి సీనియర్ స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా తమ సినిమాలతో బరిలోకి దిగుతున్నారు.
అలాగే తమిళ్ స్టార్ హీరోలు సైతం రెండు సినిమాలతో రాబోతున్నారు.దీంతో సంక్రాంతి పోటీ రసవత్తరంగా మారిపోయింది.
అయితే 2023 సమ్మర్ కూడా స్టార్ హీరోలతో నిండిపోయింది అనే చెప్పాలి.ఇంకా నాలుగు నెలల పైగానే సమయం ఉన్న ఇప్పటి నుండే సమ్మర్ ఫైట్ కోసం సిద్ధం అవుతున్నారు.
మరి ఇప్పటి 2023 సమ్మర్ ఫైట్ లో తలపడ బోతున్న స్టార్స్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం.
మెగాస్టార్ ఇటీవలే దసరా పండుగకు గాడ్ ఫాదర్ సినిమాతో వచ్చాడు.
ఇక ఇప్పుడు సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో రాబోతున్నాడు.ఇది కూడ అయిన తర్వాత సమ్మర్ లో కూడా పోటీకి సిద్ధం అవుతున్నాడు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మాస్ రాజా రవితేజ ఇటీవలే ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఇక సమ్మర్ లో మరో సినిమాతో రాబోతున్నాడు.రవితేజ వాల్తేరు వీరయ్య తో సంక్రాంతికి మెగాస్టార్ తో కలిసి వస్తున్నాడు.అయితే సమ్మర్ లో మాత్రం విడివిడిగా రాబోతున్నారు.రావణాసుర సినిమాతో మాస్ రాజా రవితేజ సమ్మర్ బరిలో దిగబోతున్నాడు.
మణిరత్నం ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వం 2 కూడా ఏప్రిల్ 28 న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
ఇది భారీ బడ్జెట్ సినిమా కాబట్టి తెలుగు సినిమాలకు పోటీగానే ఉంటుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం జైలర్ సినిమాతో సమ్మర్ రేస్ కోసమే రెడీ అవుతున్నాడు.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది.
అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాతో సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది.మరి రానున్న సమ్మర్ లో అయినా ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో వేచి చూడల్సిందే.