ఒకే కథతో ఏడుసార్లు సినిమా తీశారు.. ఏది హిట్టు ఏది ఫట్టొ తెలుసా?

ఓకే కథతో మళ్లీ మళ్లీ సినిమా. కొన్ని సినిమాలు చూడడానికి, వినడానికి భలే వింతగా ఉంటాయి.

 Filmed Seven Times With The Same Story Do You Know Which Movie Is Hit And Which-TeluguStop.com

అలాంటిదే ఇది కూడా.ఏదైనా ఒక సినిమా ఒక భాషలో హిట్ అయ్యింది అంటే మరొక భాషలో రీమేక్ చేయడం అనేది సర్వసాధారణమైన విషయమే.

అలా కాకుండా అదే సినిమాను మళ్లీ మళ్లీ సినిమాగా తీస్తూ పోతే మరి దాన్ని ఏమంటారు ? ఇలా ఒకే కథతో రెండు మూడు సినిమాలు తెరకెక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అయితే కథాంశం ఒక్కటే అయినా సినిమా ఫలితాలు మాత్రం ఎంతో భిన్నంగా ఉంటాయి.

ఇలా ఒకే సినిమా కథతో ఏడు సినిమాలను తెరకెక్కించారు.మరి ఆ 7 సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఏ సినిమా బోల్తా కొట్టింది అనే విషయాల గురించి తెలుసుకుందాం…

ఇక విషయానికొస్తే 1988లో కృష్ణంరాజు, శరత్ బాబు కలిసి నటించిన ప్రాణ స్నేహితులు అనే సినిమా వచ్చింది.

స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా అనే పాట కూడా అప్పట్లో మారుమోగింది.భారీ విజయం అని చెప్పలేను కానీ సక్సెస్ ను మాత్రం సాధించింది.

ఈ సినిమాలో రాధా కథానాయికగా నటించారు.సుప్రసిద్ధ దర్శకుడు మధుసూదన్ రావు దర్శకత్వంలో రాజ్ కోటి సంగీతంలో వచ్చిన ఈ చిత్రాన్ని జనాలు బాగానే ఆదరించారు.

Telugu Annamalai, Birla Ramudu, Fits, Flop, Kondapalli Raja, Krishnam Raju, Kud

అయితే అంతకు ముందు సంవత్సరం హిందీలో వచ్చిన కుడ్ గర్జ్ కి ఇది రీమేక్.ఆ సినిమాలో శత్రుఘ్న సింహ, జితేంద్ర హీరోలుగా నటించారు.అయితే వీటికి మూలం 1979లో వచ్చిన నవలకు కొన్ని హంగులు జోడించి ఈ సినిమాను తీశారు.ఆ తర్వాత 1992 లో రజనీకాంత్ హీరోగా ఇదే ప్రాణ స్నేహితులు సినిమాను అన్నామలై గా రీమేక్ చేసి తీస్తే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది.

Telugu Annamalai, Birla Ramudu, Fits, Flop, Kondapalli Raja, Krishnam Raju, Kud

అయితే ఇదే సినిమాను డబ్బింగ్ చేసి తెలుగులో బిర్లా రాముడిగా తీశారు.అక్కడితో వదిలేయకుండా మరో ఏడాది తర్వాత వెంకటేష్, సుమన్ హీరోలుగా కొండపల్లి రాజా అనే సినిమా రవిరాజా పినిశెట్టి తీసిన మళ్లీ హిట్ అయింది.ఈ లెక్కన ఒకే కథతో వచ్చిన మూడు తెలుగు సినిమాలను అభిమానులు ఆదరించారన్న మాట.హిందీ సినిమాలను చూసే అలవాటు ఉన్న అభిమానులకు మరో బోనస్ కుడ్ గర్జ్ కథలో నిజంగా దమ్ముంటే ఇలా ఒకే కథను ఎన్ని భాషల్లో అయినా, ఎన్నిసార్లైనా చూస్తారని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ చెప్పనవసరం లేదేమో.ఇలా ఒకే సినిమా కథతో తెలుగులో వచ్చిన ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విషయాలను అందుకొని రికార్డులను సృష్టించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube