అంతరిక్షంలో సినిమా షూటింగ్ విజయవంతం.. భూమిపైకి తిరిగి వచ్చిన చిత్ర బృందం..!

ఎక్కడ మంచి లొకేషన్ ఉంటే చాలు అక్కడ సినిమా షూటింగ్స్ తీసేస్తూ ఉంటారు.ఒక్కోసారి అత్యత ప్రమాదకరమైన ప్లేసులలో కూడా షూటింగ్ చేసిన సినిమాలను చాలానే చూసి ఉంటాము.

 Film Shooting In Space Is A Success  The Film Crew Is Back On Earth  Space, Cine-TeluguStop.com

అయితే మీరు ఎప్పుడన్నా అంతరిక్షంలో చిత్రీకరించిన సినిమా గురించి విన్నారా.ఏంటి అంతరిక్షంలో సినిమా ఏంటి అని షాక్ అవుతున్నారా మీరు విన్నది నిజమే మొదటి సారిగా రష్యా నటి యులియా పెరెసిల్డ్ తో పాటు చిత్ర డైరెక్టర్ కూడా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 12 రోజులు పాటు సినిమా షూటింగ్ లో పాల్గొని షూటింగ్ పూర్తిచేసుకుని ఆదివారం రోజున 4 గంటల 34 నిమిషాలకు నటి యులియా, క్లిమ్ షిపెన్ కో కజికిస్థాన్ లోని స్టెప్పీలో క్షేమంగా దిగినట్టు రష్యాకు చెందిన రాస్కోస్మోస్ స్పేస్ ఏజెన్సీ ప్రత్యక్ష ప్రసారం చేసిన వీడియో ఫుటేజీ ద్వారా మనం చూడొచ్చు.

అయితే స్పేస్ క్యాప్స్యూల్ నుంచి బయటకు వచ్చిన షిపెన్ కో కొంచెం మానసిక ఒత్తిడికి గురైనట్టు తెలుస్తుంది.అతన్ని పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కు తరలించేటప్పుడు మాత్రం కెమెరాలకు చేతులూపుతూ కనిపించారు.21వ శతాబ్దంలో అంతరిక్ష పోటీపై నిర్మిస్తున్న ‘ది ఛాలెంజ్‘ అనే సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం అనుభవం కలిగిన ఆంటోన్ ష్కాప్లెరోవ్ తో కలసి కజికిస్థాన్ లోని బికనీర్ కాస్మోడ్రోమ్ నుంచి ఈ నెల మొదట్లో భూమి మీద నుంచి అంతరిక్షంలోకి బయలు దేరి వెళ్లారు.అలా వీరు అంతరిక్షంలో విజయవంతంగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని భూమి మీదకు వచ్చారు.

ఈ క్రమంలో అంతరిక్ష అనుభవాల గురించి నటి యూలియా ఇలా చెప్పుకొచ్చారు.

Telugu Earth, Latest, Space-Latest News - Telugu

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో షూటింగ్ జరపుకుని తిరిగి భూమి మీదకి రావాలంటే చాలా బాధగా ఉందని నటి యులియా అన్నారు.అంతరిక్ష కేంద్రంలో 12 రోజులు పాటు షూటింగ్ అనగానే ముందు వామ్మో అన్ని రోజులా అని కొంచెం భయం వేసిందని.ఆ తరువాత అక్కడ నుండి రావాలంటే బాధగా అనిపించిందని చెప్పింది.

కాగా నాసా, ఎలోన్ మస్క్ స్పేస్ ఎక్స్ కలిసి చేపట్టిన మిషన్ ఇంపాజిబుల్ స్టార్టామ్ క్రూయిజ్ సహాయంతో ఈ హాలీవుడ్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశామని ఈ చిత్ర బృందం చెబుతోంది.మొదటిసారి స్పేస్ లో చిత్రీకరించిన ఈ సినిమాను చూడడానికి నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube