మా అసోసియేషన్ ఆయన పెట్టిన బిక్ష అంటున్న నిర్మాత...

గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమిటీలో పలు వివాదాలు తలెత్తున్న సంగతి తెలిసిందే.అంతేగాక ఇప్పటికే మా అధ్యక్షుడు నరేష్ ని రాజీనామా చేయాలంటూ జీవితా రాజశేఖర్ లేఖ కూడా రాశారు.

 Film Producer Natti Kumar Doing Sensational Comments On Maa Association-TeluguStop.com

అయితే ఈ విషయంపై తాజాగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత నట్టికుమార్ స్పందించాడు.ఈ సందర్భంగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అయితే ఇందులో భాగంగా మొన్న మా డైరీ ఆవిష్కరణ సమయంలో జరిగినటువంటి వివాదాన్ని గుర్తు చేస్తూ ఆ సమయంలో రాజశేఖర్ స్టేజి దిగిపోయినటువంటి  సంఘటనలో రాజశేఖర్ కి తన మద్దతు తెలియజేశాడు.ఎందుకంటే ప్రస్తుతం మా ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఆధిపత్య పోరు నడుస్తుందని సినీ ప్రముఖులు ఎవరికైతే మద్దతు తెలుపుతూ వారే చక్రం తిప్పుతున్నారు అని అది సరి కాదని అన్నారు.

అయితే ఇక్కడ అ నరేష్ కి మహేష్ కుటుంబ సభ్యుల అండ ఉందని కానీ రాజశేఖర్ కి ఏ హీరో సపోర్ట్ లేదని అందువలన అతడు ఒక్కడే ఒకవైపు నిల్చొని పోరాడుతున్నారని అన్నారు.

Telugu Natti Kumar, Maa-Movie

అంతేగాక ఇప్పటివరకు కొంతమంది పలువురు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశామని చెప్పుకుంటున్నారని కానీ ఇంతవరకు కనీసం జగన్ ని కలవలేదని ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్నటువంటి కొంత మంది సభ్యులకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఇష్టం లేదని అందువల్లనే కలవలేదని అన్నారు.

కానీ ఇప్పుడున్నటివంటి “మా” అసోసియేషన్ ఒకప్పుడు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్షని కానీ మా సభ్యులు మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఇష్టపడడం లేదన్నారు.అంతేగాక బయట రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కూడా రాజకీయాలు ఉన్నాయని కాకపోతే సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలు ఇప్పటికే ఈ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.

మరియు ఆర్టిస్టులు  ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube