గత నాలుగు రోజులుగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ నటుడు దర్శకుడైన పోసాని కృష్ణ మురళి కి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో ఇప్పటికే కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు దర్శకుడు పోసాని కృష్ణ మురళిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా ఇటీవలే ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ కి వెళ్లి వస్తుండగా పోసాని కృష్ణమురళి పై కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు దాడికి యత్నించారు.అయితే తాజాగా ఈ విషయంపై తెలుగు సినీ నిర్మాత “నల్లం శ్రీనివాస్” తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించాడు.
ఇందులో భాగంగా మెంటల్ కృష్ణ పోసాని కృష్ణ మురళికి మతి స్థిమితం సరిగా లేదని అందువల్లనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు.అంతేకాకుండా పోసాని కృష్ణ మురళి కి మాటలు మార్చడం చాలా తేలికని ఈ క్రమంలో పోసాని కృష్ణ మురళి హీరోగా నటించిన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి ఆర్థికంగా నష్టపోయానని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా తనలాంటి చిన్నాచితకా నిర్మాతల వద్ద పోసాని కృష్ణ మురళి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టాడని అలాగే పోసాని కృష్ణ మురళి మంచి రసికుడని ఈ క్రమంలో సినిమా షూటింగుల పేరుతో అమ్మాయిలతో రాసలీలలు నిర్వహించేవాడని ఘాటుగా విమర్శలు చేశాడు.అంతేకాకుండా నీలాంటి వాళ్ళు చేస్తే సంసారం ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారమా.? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.కానీ ఇప్పటివరకు ఈ విషయంపై దర్శకుడు పోసాని కృష్ణమురళి మాత్రం ఎలాంటి కామెంట్లు చేయలేదు.
దీంతో ప్రముఖ సినీ నిర్మాత నల్లం శ్రీనివాస్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ విషయం ఇలాఉండగా ఇటీవలే దర్శకుడు పోసాని కృష్ణమురళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు పోసాని కృష్ణ మురళి పై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాలలో చేస్తున్నారు అంతేకాకుండా అసభ్యకర పదజాలంతో పోసాని కృష్ణ మురళి కుటుంబ సభ్యులను కూడా తిడుతున్నారు.
దీంతో తాజాగా ఈ విషయంపై పోసాని స్పందిస్తూ పవన్ కళ్యాణ్ ఒక నియంతలా ప్రవర్తిస్తున్నారని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కొనసాగితే ఖచ్చితంగా అతడిపై చర్యలు తీసుకుంటానని పోసాని కృష్ణమురళి వార్నింగ్ ఇచ్చాడు.అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం పోసాని కృష్ణ మురళి గురించి స్పందించడం లేదు సరికదా కనీసం పట్టించుకోవడం లేదు.
మరి వీరిద్దరి వ్యవహారం చివరికి ఎప్పుడు జరుగుతుందో చూడాలి.