వర్మ ఇలా చేస్తాడని తన కలలో కూడా అనుకోలేదంటున్న ప్రొడ్యూసర్...

ఎప్పుడు వివాదాలతో స్నేహం చేస్తూ విభిన్న కథనాలు ఆడించుకుంటూ ప్రేక్షకులను అలరించే టువంటి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి సినీ పరిశ్రమలో పెద్దగా తెలియని వారుండరు.అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ పై ప్రముఖ సినీ నిర్మాత కరణ్ జోహార్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Film Producer Karan Johar Is Doing Shocking Comments Rgv-TeluguStop.com

తాజాగా బాలీవుడ్ చిత్రం భూతః ది హంటెడ్ షిప్ అనే ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.అంతేగాక ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది.

అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ చిత్ర టైటిల్ విషయమై  రామ్ గోపాల్ వర్మ కి ఫోన్ చేసి మాట్లాడాడు.ఇందులో భాగంగా రామ్ గోపాల్ వర్మ 2003వ సంవత్సరంలో తీసినటువంటి భూతః హంటెడ్ షిఫ్ అనే చిత్రం టైటిల్ ని తాను ప్రస్తుతం నిర్మిస్తున్నటువంటి చిత్రానికి ఉపయోగించనున్నట్లు అడిగాడు.

దీంతో రామ్ గోపాల్ వర్మ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పాడని అన్నారు.అంతేగాక ఈ టైటిల్ విషయమై తాను ఎక్కడ సంతకం చేయాలన్నా చేస్తానని నిర్మొహమాటంగా చెప్పేశాడట.

దీంతో కరణ్ జోహార్ రామ్ గోపాల్ వర్మ వంటి మంచి వ్యక్తిని తన 25 ఏళ్ల సినీ జీవితంలో చూడలేదని అన్నారు.అంతేగాక బయటికి ఎప్పుడూ ప్రాక్టికల్ గా మాట్లాడేటువంటి రామ్ గోపాల్ వర్మ చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారని మరియు మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి అని కితాబిచ్చారు.

Telugu Karan Johar, Karanjohar, Ram Gopal Varma, Ramgopal-Movie

అయితే ఇది ఇలా ఉండగా తాజాగా హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి దిశగా ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ కి గురైన సంగతి తెలిసిందే.అయితే ఇందులో ఓ నిందితుడి భార్య గర్భవతిగా ఉండడంతో ఆమెకి రాంగోపాల్ వర్మ కొంత ఆర్థిక పరంగా సాయం కూడా చేశారు.దీంతో రాంగోపాల్ వర్మ అభిమానులు తన వ్యక్తిత్వానికి ఫిదా అయి అభినందనలు, ప్రశంసలు కురిపిస్తున్నారు.ఎప్పుడు ముక్కుసూటిగా కరుకుగా మాట్లాడే రామ్ గోపాల్ వర్మ వెనుక ఇంతటి మంచి హృదయం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube