తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపుగా 30 పైగా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో బడా నిర్మాతగా కొనసాగుతున్న ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఇటీవలే సినీ నిర్మాత దిల్ రాజు ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన సమావేశంలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా ఇటీవల టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన టువంటి పలువురు సినీ నిర్మాతలు కలిసి మినిస్టర్ పేర్ని నాని తో భేటీ అయ్యామని ఈ భేటీలో భాగంగా ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమ లో ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించామని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో నష్టపోయిన సినీ నిర్మాతలకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రితో చర్చించినట్లు తెలిపాడు.ఈ క్రమంలో లో పలు సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ వాటితో సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వాలు ఎప్పుడూ సానుకూలంగా ఉన్నాయని దాంతో ప్రతి విషయాన్ని కాంట్రవర్సీ చేయకుండా చూడాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి మరియు మీడియా సభ్యులకు కూడా ఉందని తమ బాధ్యతలను గుర్తు చేశాడు.
అలాగే సినిమా పరిశ్రమ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని మంత్రి పేర్ని నాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు తెలిపాడు.అంతేకాకుండా రాజకీయాలు వేరు, సినిమాలు వేరని కాబట్టి సినిమా ఇండస్ట్రీలోని విషయాలని రాజకీయాలతో ముడి పెట్టడం వల్ల సినిమా ఇండస్ట్రీలో ఇబ్బందులు తలెత్తుతాయని కూడా సూచించాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నిర్మాత దిల్ రాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు.అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించినప్పటికీ సినిమా టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించ లేదు.అయినప్పటికీ వకీల్ సాబ్ చిత్రం బాగానే వసూళ్ళు రాబట్టింది.కాగా ప్రస్తుతం దిల్ రాజు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు ప్రముఖ విలక్షణ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో భారీ బడ్జెట్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు కాగా ఈ చిత్రానికి దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు సమాచారం.