మోహన్ బాబు ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఆగంతకుల హెచ్చరిక  

Speeding car rammed into Mohan Babu house, Tollywood, Film Nagar, Hyderabad, Manchu Mohan Babu - Telugu Film Nagar, Hyderabad, Manchu Mohan Babu, Speeding Car Rammed Into Mohan Babu House, Tollywood

టాలీవుడ్ లో ఎక్కువగా ఫోకస్ అయ్యే ఫ్యామిలీ అంటే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ అని చెప్పాలి.మోహన్ బాబు నుంచి మంచు లక్ష్మి వరకు వారి ఇంట్లో అందరూ ప్రత్యేకమే.

 Film Nagar Hyderabad Manchu Mohan Babu

మంచు విష్ణు హీరోగా చేస్తూనే బిజినెస్ మెన్ గా తనని తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు.ఇక మంచు మనోజ్ సినిమాలలో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

మంచి లక్ష్మి కూడా ఓ వైపు నటిగా, మరో వైపు యాంకర్ గా మల్టీ టాలెంట్ చూపిస్తుంది.ఇంత సక్సెస్ ఫుల్ ట్రాక్ ఉన్న కూడా వీరి మీద రెగ్యులర్ లో ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది.

మోహన్ బాబు ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఆగంతకుల హెచ్చరిక-General-Telugu-Telugu Tollywood Photo Image

ఎవరో ఒకరు వీరిని టార్గెట్ చేస్తూ ఉంటారు.ఇదిలా ఉంటే తాజాగా మోహన్ బాబు నివాసం వద్ద కొందరు దుండగులు తీవ్ర భయాందోళనలు రేకెత్తించారు.

హైదరాబాదులోని మోహన్ బాబు నివాసంలోకి ఓ కారులో దూసుకెళ్లిన దుండగులు మిమ్మల్ని వదలబోమంటూ ఆయన కుటుంబ సభ్యులను హెచ్చరించారు.

మోహన్ బాబు ఇంటి సెక్యూరిటీ సిబ్బంది ఆదమరిచి ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇన్నోవా కారు ఆయన ఇంట్లోకి దూసుకెళ్లింది.

అందులో నలుగురు వ్యక్తులు ఉన్నట్టు గుర్తించారు.వారు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పిమ్మట మళ్లీ అదే కారులో వెళ్లిపోయారు.

ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన మోహన్ బాబు కుటుంబ సభ్యులు పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.మోహన్ బాబు ఇంటికి వెళ్లి మరీ హెచ్చరించింది ఎవరన్నది ఆసక్తికర అంశంగా మారింది.

ఈ మధ్యకాలంలో మోహన్ బాబు ఫ్యామిలీ ఎవరి జోలికి వెళ్ళలేదు.అలాంటిది వారి ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇవ్వాల్సినంత అవసరం ఎవరికి వచ్చింది.

ఎవరైనా తాగుబోతులు కావాలని అలా హడావిడి చేసారా అనే విషయాలని కూపీ లాగే పనిలో పోలీసులు ఉన్నారు.

#Hyderabad #Film Nagar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Film Nagar Hyderabad Manchu Mohan Babu Related Telugu News,Photos/Pics,Images..