సంక్రాంతి కంటే సమ్మర్‌ బెటర్‌ అనుకుంటున్న స్టార్స్‌

కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌ నుండి థియేటర్ల అన్‌ లాక్‌ కు ఓకే చెప్పే అవకాశం ఉంది.ఇప్పటికే అందుకు సంబంధించిన మార్గదర్శకాలు రెడీ చేయడంలో సమాచార శాఖ నిమగ్నం అయ్యి ఉన్నట్లుగా తెలుస్తోంది.

 Film Makers Want To Release Movie In 2020 Summer , Movie Theaters, Summer, Tolly-TeluguStop.com

థియేటర్లలో కరోనా నియంత్రణ చర్యలు మరియు సామాజిక దూరం సాధ్యా సాధ్యాల గురించి చర్చిస్తున్నారు.వారం నుండి రెండు వారాల్లో అన్ని విషయాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

వచ్చే నెల నుండి థియేటర్లు ఓపెన్‌ అయితే వెంటనే కాకున్నా డిసెంబర్‌ లేదా జనవరి వరకు అయినా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు భావిస్తున్నారు.

సంక్రాంతికి పెద్ద చిన్న సినిమాలు క్యూ కట్టే అవకాశం ఉందని చాలా మంది అనుకున్నారు.

కాని ప్రస్తుత పరిస్థతి చూస్తుంటే సంక్రాంతికి వచ్చేందుకు పెద్ద సినిమాలకు పెద్దగా ఆసక్తి ఉన్నట్లుగా అనిపించడం లేదు.సంక్రాంతికి సినిమాలు విడుదల చేసే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలను తీసుకోవడంలో ప్రముఖ హీరోలు ఆసక్తి చూపడం లేదు.

ఎందుకంటే ప్రముఖ హీరోల సినిమాలు అన్ని కూడా వందల కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉంటుంది.అలాంటి సినిమాలను సంక్రాంతికి విడుదల చేయడం వల్ల ఇంకా ప్రజలు ప్యానిక్‌ గానే ఉంటారు.

కనుక థియేటర్లకు రావాలంటే ఇంకాస్త భయంతో ఉంటారు.

కరోనా భయం పూర్తిగా పోయే వరకు ఖచ్చితంగా ప్రేక్షకులు నూటికి నూరు శాతం రారు అనేది ప్రతి ఒక్కరి మాట.వచ్చ ఏడాది జనవరి వరకు కరోనా వ్యాక్సిన్‌ వస్తుందని అంతా చాలా నమ్మకంగా చెబుతున్నారు.కనుక కరోనా వ్యాక్సిన్‌ వచ్చి రెండు మూడు నెలలు అయినంత వరకు కరోనా భయం ఉంటుంది.

అంటే మార్చి ఏ్రపిల్‌ వరకు కరోనా ఇంకా ఉందనే ఆందోళన ఉంటుంది.ఆ తర్వాత కరోనా భయం పోతుంది.అందుకే సంక్రాంతి కంటే సమ్మర్‌ లో సినిమాలు విడుల చేయడం అన్ని విధాలుగా ప్రయోజనకరంగా సినీ నిర్మాతలు మరియు స్టార్‌ హీరోలు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube