బ్రేకింగ్‌ : మంత్రి ఎంట్రీతో సినీ కార్మికుల వివాదం పరిష్కారం

సినీ కార్మికులు మరియు కింది స్థాయి టెక్నికల్‌ సపోర్ట్‌ ఎంప్లాయిస్‌ తమకు ఇచ్చే రోజువారి వేతనంను 45 శాతం పెంచాలంటూ డిమాండ్ చేస్తూ సమ్మె కు దిగిన విషయం తెల్సిందే.రెండు రోజులుగా షూటింగ్‌ లు మొత్తం ఎక్కడికి అక్కడ నిలిచి పోయాయి.

 Film Federation Workers Strike Cancel Details, Film Federation, Talasani Sriniva-TeluguStop.com

దాదాపుగా 30 తెలుగు సినిమాల షూటింగ్స్ నిలిచి పోవడం జరిగింది.మొదటి రోజు కొందరు షూటింగ్‌ కు వెళ్లేందుకు సిద్ధం అవ్వగా ఇతర కార్మికులు వాళ్లకు అడ్డం పడ్డారు.

దాంతో షూటింగ్ లు పూర్తిగా నిలిచి పోయాయి.రెండు రోజుల షూటింగ్ లు నిలిచి పోవడం తో మంత్రి తలసాని శ్రీనివాస్ రంగం లోకి దిగారు.

మంత్రి రంగం లోకి దిగి వర్కర్స్‌ అసోషియేషన్స్ మరియు నిర్మాతల అసోషియేషన్స్ తో మాట్లాడాడు.

ఈ సందర్బంగా తమకు 45 శాతం వేతనం పెంపు కావాలంటూ వర్కర్స్ డిమాండ్‌ చేశారు.

మరో వైపు నిర్మాతలు మాత్రం ఇప్పటికిప్పుడు వేతనం పెంచడం అంటే సాధ్యం అయ్యే పని కాదు.భవిష్యత్తులో తప్పకుండా రేట్లను పెంచుతాం అంటూ చెప్పుకొచ్చాడు.వేరు వేరు గా చర్చలు జరిపిన మంత్రి తలసాని చివరకు సినీ కార్మికులతో సమ్మె విరమింపజేశాడు.15 రోజుల్లో కొత్త వేతనంను తీసుకు వస్తారని మంత్రి హామీ ఇచ్చాడు.

Telugu Employees, Telugu, Kalyan, Producers-Movie

అంతే కాకుండా నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయి.వాటిని నెరవేర్చుకుంటూ కార్మికులు కోరిన విధంగా జీతాలు ఇవ్వాలంటూ మంత్రి సూచించాడు.మంత్రి సూచన మేరకు రెండు వైపుల వారు సంతృప్తి చెందడంతో రేపటి నుండి షూటింగ్ లు జరగబోతున్నాయి.ఆ షూటింగ్ లకు సినీ కార్మికులు అంతా కూడా హాజరు అవ్వబోతున్నారు అంటూ అధికారికంగా సి కళ్యాణ్ ప్రకటించాడు.

ఈ సమస్య పరిష్కారం లో మంత్రి తలసాని కీలక పాత్ర పోషించారు.సినీ కార్మికులు మరియు నిర్మాతలు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube