ఆర్జీవీ బయోపిక్ కి నో చెప్పిన ఫిలిం ఛాంబర్...

ఎప్పుడూ విభిన్న కథనాలను ఎంచుకుంటూ నిత్యం ఏదో ఒక వివాదంలో మునిగితేలుతూ వార్తల్లో నిలిచే అటువంటి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ప్రమేయం లేకుండా మరోసారి వార్తల్లో నిలిచారు.గతంలో ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు మరియు రామ్ గోపాల్ వర్మ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది.

 Film Chamber Said No To The Rgv Biopic-TeluguStop.com

అయితే ఇందులో భాగంగా అప్పట్లో జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు వర్మపై పలు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.అంతేగాక వర్మ పేరుతో  ఒక సినిమా తీస్తానని ఆ సినిమాకి సైకో వర్మ అనే పేరు పెట్టి విడుదల చేస్తానని కూడా చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే అనుకున్నదే తడవుగా జొన్నవిత్తుల రాంగోపాల్ వర్మ జీవిత కథను తెరకెక్కించేందుకు సన్నద్ధం అయ్యాడు.ఇందులో భాగంగా ఈ చిత్రానికి “ఆర్జివీ ఓ సైకో” బయోపిక్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.

ఈ క్రమంలో ఈ చిత్ర టైటిల్ ని ఫిలిం చాంబర్ లో నమోదు చేసేందుకు వెళ్లగా రామలింగేశ్వర రావుకు ఫిలిం ఛాంబర్ అధికారులు షాక్ ఇచ్చారు. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఖరారు చేసినటువంటి ఈ పేరుతో చిత్ర టైటిల్ ని రిజిస్టర్ చేయాలంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  నుంచి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకురావాలని లేకపోతే చిత్ర టైటిల్ రిజిస్టర్ చేయడం కుదరదని తెగేసి చెప్పారు.

దీంతో ఎంతో ఆశగా వర్మ బయోపిక్  తీద్దామనుకున్న జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.

Telugu Ramgopal, Rgv Biopic, Tollywoodrgv-Movie

అయితే ఇదిలా ఉండగా ఇప్పటికే ఓ ప్రముఖ నిర్మాత కూడా రామ్ గోపాల్ వర్మ బయోపిక్ ని నిర్మించాడానికి  ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చాడు.అసలే ప్రేక్షకుల్లో రాంగోపాల్ వర్మకి ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు.ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకుందామని కొండంత ఆశతో ఉన్న నిర్మాత కొంతమేర నిరాకరించినట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం ఈ విషయంపై టాలీవుడ్ సినీవర్గాలు తీవ్రంగానే చర్చించుకుంటున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube