పవన్ కి ఊహించిన షాక్ ఇచ్చిన ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్..!!

“రిపబ్లిక్” సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యలు.అటు రాజకీయ పరంగా ఇటు సినిమా పరంగా అగ్గి రాజేసింది.

 Film Chamber Of Commerce Gave Pawan An Unexpected Shock-TeluguStop.com

పవన్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ మంత్రులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.ఇటువంటి తరుణంలో పవన్ వ్యాఖ్యలపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రియాక్ట్ అయ్యింది.“రిపబ్లిక్” ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ప్రకటన విడుదల చేయడం జరిగింది.ఆయన చేసిన వ్యాఖ్యలకు ఫిలిం ఛాంబర్ కి ఎటువంటి సంబంధం లేదని వెల్లడించింది.

అంత మాత్రమే కాక చిత్ర పరిశ్రమపై చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, వ్యక్తిగత అభిప్రాయాలను పలు వేదికలపై.కొంతమంది వెల్లడి చేస్తున్నారని.వాళ్లు చేసిన వ్యాఖ్యలకు ఫిలిం ఛాంబర్ కి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది.అంత మాత్రమే కాక సినిమా పరిశ్రమకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్ అవసరమని స్పష్టం చేయడం జరిగింది.

 Film Chamber Of Commerce Gave Pawan An Unexpected Shock-పవన్ కి ఊహించిన షాక్ ఇచ్చిన ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే క్రమంలో సినిమా ఇండస్ట్రీ కి సంబంధించి ఇబ్బందుల విషయంలో ఎప్పటికీ ఏపీ మంత్రి పేర్ని నానితో చర్చించగా ఏపీ ప్రభుత్వం సానుకూలంగానే ఉందని.తన ప్రకటనలో.

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేయడం జరిగింది.రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా అండగా నిలుస్తున్నారని కూడా పేర్కొంది.

దీంతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేసిన ప్రకటన పవన్ కి షాక్ ఇచ్చినట్లు అయింది…అని తాజా వార్త పై బయట టాక్.

#ChamberCommerce #YCP #YS Jagan #@republic #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు