ఎన్టీఆర్ తరువాత ఆయనే అంటూ.... వైసీపీలో చేరిన సినీ నటుడు !     2018-12-25   20:33:02  IST  Sai Mallula

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ద్వారా రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించాడని ప్రముఖ సినీ నటుడు… హీరో భానుచందర్ కితాబునిచ్చారు. అంతే కాదు… స్వర్గీయ నందమూరి తారక రామారావు తరువాత అంత కొప్పు పేరు ప్రఖ్యాతలు సంపాధించిన నాయకుడు మరొకరు లేరని… అంటువంటి నాయకుడిని మరొకరిని చూడలేదని భానుచందర్ జగన్ ని ప్రశంసించారు. జగన్ ను ఆయన కలిసి వచ్చారు. సంఘీ భావం ప్రకటించారు.

Film Actior Bhanuchandar Join In Ysr Congress Party-

Film Actior Bhanuchandar Join In Ysr Congress Party

ఆ తర్వాత విశఖ జిల్లాలో ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీలో చేరానని భానుచందర్‌ అన్నారు. ‘‘రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నా. వైసీపీ అధినేత పాదయాత్రలో పాల్గొన్నాను. జగన్‌ ఎంతో ఓర్పు, ఔదార్యం కలిగిన నాయకుడు. జగన్‌ను చూసినప్పుడు నాకు బుద్ధుడి రూపం కళ్ల ముందు కదలాడిందని భానుచందర్ పేర్కొన్నారు.