35 రూపాయల కోసం ఏకంగా రైల్వే శాఖ తో రెండేళ్ల పోరాటం చివరికి ఏమైందంటే

మనం ఏదైనా రెస్టారెంట్ కో లేదా ఏదైనా పెద్ద హోటల్ కి వెళ్తే అక్కడ 50 రూ .లో లేదా 100 రూ .

 Fighting With The Railway Ministry For 35 Rupees-TeluguStop.com

టిప్ గా ఇస్తాం.మనకి 50 , 100 రూపాయలు పెద్దగా అనిపించవు.అయితే ఒకతను మాత్రం కేవలం రూ.35 కోసం ఏకంగా రెండేళ్ల పాటు రైల్వే శాఖ తో పోరాటం చేసాడు.చివరికి అతనికి రైల్వే శాఖ 33 రూపాయలు చెల్లించగా, తనకు రావాల్సింది 35 రూపాయలు అని ఇంకా 2 రూపాయల కోసం మల్లి పోరాటం చేస్తా అంటున్నాడు.అసలు విషయం ఏంటి , రెండేళ్లు ఎందుకు పోరాటం చేసాడో అని అనుకుంటున్నారా ? అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే…

రాజస్థాన్‌లో కోటా అనే ప్రదేశం లో నివసిస్తున్న సుజీత్ స్వామి ఓ ఇంజనీర్.ఆయన 2017 జూలై 2న ఢిల్లీ కి వెళ్లాలనుకున్నాడు.దానికోసం దాదాపు రెండు నెలల ముందుగా టికెట్ బుక్ చేసుకున్నారు.

అయితే వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉండటంతో కొద్దిరోజుల ముందు సుజీత్ తన బుక్ చేసుకున్న టిక్కెట్టు ని క్యాన్సిల్ చేసుకున్నాడు కానీ టికెట్ రద్దు చేసుకున్న తర్వాత సుజీత్‌కు రావాల్సిన పూర్తి మొత్తం డబ్బు వెనక్కి రాలేదు.అతను చెల్లించిన మొత్తం టికెట్ ధరలో ( రూ.765 ) రూ.100 తగ్గించి, రూ.665 రీఫండ్ చేశారు.రైల్వేశాఖ నిబంధనల ప్రకారం వెయిటింగ్ జాబితాలో ఉన్న టికెట్‌ను రద్దు చేసుకుంటే రూ.65 ఛార్జ్ ని టికెట్ మొత్తం ధరలో నుండి తీసివేసి మిగిలిన మొత్తాన్ని వాపసు ఇస్తారు.అయితే తన నుంచి రూ.65 ఛార్జ్ చేయడంతో సుజీత్ రైల్వేశాఖను సంప్రదించారు.అదే ఏడాది జీఎస్టీ అమల్లోకి రావడంతో మిగతా రూ.35 సర్వీస్ ట్యాక్స్ కింద ఛార్జ్ చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది.అయితే తాను జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందే టికెట్‌ను రద్దు చేసుకున్నానని తన రూ.35 తనకు ఇవ్వాలని ఐఆర్‌సీటీసీని కోరారు.

35 రూపాయల కోసం ఏకంగా రైల్వే శాఖ

కానీ రైల్వే శాఖల నుండి అతనికి ఎటువంటి సమాచారం రాలేదు దీనితో అతను 2018 ఏప్రిల్‌లో లోక్‌ అదాలత్‌ను ఆశ్రయించారు.ఇక్కడ కూడా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.ఈ విధంగా సుమారు రెండేళ్ల పాటు సుజీత్ రైల్వేశాఖతో పోరాటం చేశారు.

ఈ క్రమంలో మే 1న ఆయన పోరాటానికి ఫలితం దక్కింది.ఆయన ఖాతాలోకి రూ.33ను ఐఆర్‌సీటీసీ జమ చేసింది.ఇన్నాళ్లపాటు తనకు రావాల్సిన సొమ్మును ఇవ్వకపోవడంతో పాటు రూ.2 తగ్గించి ఇవ్వడంతో సుజీత్ ఆవేదన వ్యక్తం చేశారు.రూ.35 కి బదులుగా రూ.33 చెల్లించడం తో మిగిలిన ఆ రెండు రూపాయల కోసం తాను మళ్ళీ పోరాటం చేస్తానని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube