టీఆర్ఎస్‌లో ముదిరిన ఫైటింగ్‌... ఆ ఇద్ద‌రికి క్లాస్ పీకారా...!

టీఆర్ఎస్‌లో చాలా జిల్లాలో నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు తారాస్థాయికి చేరుకుంది.ఒక‌రిపై మ‌రొక‌రు పై చేయి సాధించేందుకు పావులు క‌దుపుతున్నారు.

 Fighting Peaks Between Trs Leaders, Kancherla Bhupal Reddy, Komatireddy, Lingaia-TeluguStop.com

దీంతో రాజ‌కీయం కాస్తా ముదిరి పాకాన ప‌డుతోంది.న‌ల్ల‌గొండ జిల్లాలో ఇద్ద‌రు గులాబీ పార్టీ ఎమ్మెల్యేల మ‌ధ్య ఇప్పుడు కోల్డ్‌వార్ భ‌గ్గుమంటోంది.

న‌ల్ల‌గొండ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్‌రెడ్డి, న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తేనే భ‌గ్గుమంటోంది.వీరిలో భూపాల్‌రెడ్డి సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిని ఓడించారు.

చిరుమ‌ర్తి వేముల వీరేశంను ఓడించారు.చిరుమ‌ర్తి కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ త‌ర్వాత కారెక్కారు.

Telugu Jagadeesh Reddy, Kancherlabhupal, Komati, Lingaiah, Nalagonda, Telangana,

వీరు ఇద్ద‌రు వేర్వేరు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎమ్మెల్యేలుగా ఉన్నా వీరిది ఒకే ప్రాంతం కావ‌డ‌మే వీరి మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణ‌మైందంటున్నారు.గ‌తంలో భూపాల్‌రెడ్డి టీడీపీలో ఉంటే, చిరుమ‌ర్తి కాంగ్రెస్‌లో ఉండేవారు.అప్ప‌టి నుంచే వీరి మ‌ధ్య స‌ఖ్య‌త లేదు.ఇక గ‌త ఎన్నిక‌ల్లో భూపాల్‌రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిస్తే… కాంగ్రెస్‌లో గెలిచిన చిరుమ‌ర్తి జండా మార్చేశారు.ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నా వీరి మ‌ధ్య ఏ మాత్రం స‌ఖ్య‌త లేదు.భూపాల్‌రెడ్డి స్వ‌గ్రామం న‌కిరేక‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని చిట్యాల మండ‌లంలో ఉంది.

దీంతో భూపాల్‌రెడ్డి చిట్యాల‌, న‌కిరేక‌ల్ మండ‌లాల్లో త‌న కేడ‌ర్‌కు స్థానిక ఎన్నిక‌ల్లో కొన్ని సీట్లు ఇవ్వాల‌ని కోరినా చిరుమ‌ర్తి ప‌ట్టించుకోలేదు.

Telugu Jagadeesh Reddy, Kancherlabhupal, Komati, Lingaiah, Nalagonda, Telangana,

దీంతో భూపాల్‌రెడ్డి చిరుమ‌ర్తికి వ్య‌తిరేకంగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు ప్రాధాన్య‌త ఇస్తున్నారు.దీంతో ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేల మ‌ధ్య గొడ‌వ‌లు భ‌గ్గుమంటున్నారు.ఒకే పార్టీలో ఉన్నా ఒక‌రినొక‌రు ఎదురు ప‌డిన‌ప్పుడు క‌నీసం మాట్లాడుకుంటోన్న ప‌రిస్థితి కూడా లేదు.

ఇక చిట్యాల ద‌గ్గ‌ర కంచ‌ర్ల బ్ర‌ద‌ర్స్‌కు కాట‌న్ మిల్ ఉంది.ప‌త్తి కొనుగోళ్ల విష‌యంలో టోకెన్ ప‌ద్ధ‌తి అమలు చేయాల‌ని స్థానిక ఎమ్మెల్యే హోదాలో చిరుమ‌ర్తి ఆదేశించారు.

దీంతో ఎక్క‌డా లేని ప‌ద్ధ‌తి త‌మ మిల్లుకే ఎందుక‌ని కంచ‌ర్ల సోద‌రులు ఫైర్ అవుతున్నారు.

మ‌రోవైపు ఎంపీ కోమ‌టిరెడ్డి అనుచ‌రుడే లింగ‌య్య‌.

కోమటిరెడ్డి డైరెక్ష‌న్‌లోనే లింగ‌య్య త‌మ‌ను టార్గెట్ చేశాడ‌ని భూపాల్‌రెడ్డి ఫైర్ అవుతున్నారు.చివ‌ర‌కు జిల్లా మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి జోక్యం చేసుకుని.

పార్టీకి ఇబ్బంది క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని ఇద్ద‌రికి క్లాస్ కూడా పీకార‌ట‌.అయినా ప‌రిస్థితిలో పెద్ద మార్పు లేద‌ని అంటున్నారు.

మ‌రి ఈ ఇద్ద‌రు అధికార పార్టీ ఎమ్మెల్యేల కోల్డ్ వార్ ఎంత వ‌ర‌కు వెళుతుందో ?  చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube