ఒక కోడి చేసిన పనికి ఊరు మొత్తం గొడవ అయ్యింది... 34 మందిపై కేసు నమోదు, గ్రామంలో 144 సెక్షన్‌

కొన్ని సంఘటనల గురించి విన్నప్పుడు అది ఖచ్చితంగా నిజం కాదు, ఎవరో కావాలని కల్పించారు అనిపించక మానదు.ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని నమ్మలేం అంటారు.

 Fighting Atmosphere In A Village Due To A Chicken-TeluguStop.com

సాక్ష్యాధారాలను చూపించినా కూడా కొందరు నిజంగానే అంటూ ఇంకా అనుమానంగానే చూస్తారు.తాజాగా కర్ణాటక రాష్ట్రం రాయచూరిలో సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జరిగిన సంఘటన కూడా ఎవరు నమ్మలేదు.

ఊరంగా గొడవలు, కత్తులతో నరుక్కునే వరకు వెళ్లి, గ్రామంలో 144 సెక్షన్‌ విధించి 34 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది.ఇంత జరగడానికి కారణం ఒక కోడి, అవును ఒక కోడి చేసిన పనికి ఇంత జరిగింది అంటే ఆశ్చర్యంగా ఉంది కదా…

పూర్తి వివరాల్లోకి వెళ్తే… రాయచూర్‌ సమీపంలోని యురగేనా మండలం బీజనగేరా అనే గ్రామంకు చెందిన తిమ్మప్ప మరియు నరసప్ప అనే రక్త సంబంధీకులు ఉన్నారు.

ఈ ఇద్దరు కూడా పక్క పక్క ఇళ్లే.వీరిద్దరికి చాలా ఏళ్లుగా భూ తగాదాలు ఉన్నాయి.

పెద్ద మనుషుల సమక్షంలో వాటికి సంబంధించిన రాజీ జరుగుతుంది.ఈ సమయంలోనే వారి ఇళ్ల మద్య ఉన్న ఒక మట్టి దిబ్బను తిమ్మప్ప కోడి తోడటం జరిగింది.

మట్టి దిబ్బను కోడి తోడటంతో నరసప్ప ఇంట్లో పడింది.నరసప్ప ఇంటి ముందు మట్టి పడటంతో వారి కుటుంబ సభ్యులు గొడవకు సిద్దం అయ్యారు.

తిమ్మప్ప కోడిపై దాడి చేసేందుకు ప్రయత్నించిన సమయంలో వివాదం మొదలైంది.

ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.కర్రలతో దాడికి సిద్దం అయ్యారు.నరసప్ప మరియు తిమ్మప్ప తరపు వారు వచ్చిన తర్వాత గొడవను తగ్గించేందుకు ప్రయత్నించారు.

కాని వారిలో కూడా కొందరు గొడవ పడేందుకు సై అంటే సై అనడంతో ఇద్దరి మద్య గొడవ కాస్త ఇరవై మంది మద్య జరిగింది.అది కాస్త ఊరంగా పాకింది.

వందలాది మంది తలలు పలిగాయి, రక్తాలు కారాయి.

విషయం తెలిసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.గ్రామంలో ఎవరు కూడా బయటకు తిరగకుండా ఆదేశాలు జారీ చేశారు.144 సెక్షన్‌ విధించిన కారణంగా గ్రామం రోడ్ల మీద ఎవరు తిరగకూడదు.34 కేసులు పెట్టిన పోలీసులు గ్రామంలో 25 మంది పోలీసు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది.మొత్తానికి ఒక కోడి చేసిన పనికి ఇంత జరిగింది.

అయితే ఆ రెండు కుటుంబాల మద్య చిన్న గొడవ ఉంటే కోడి చేసిన పనిని చిన్నదిగానే చూసేవారు.కాని వారు ఇద్దరు కూడా ఎప్పుడెప్పుడు గొడవకు దిగుదామా అని ఎదురు చూస్తున్నారు కనుక కోడి వారికి అవకాశం కల్పించింది.

పాపం ఇందులో కోడిని ఏం అనలేం కదా.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube