యోగ చేస్తూ పిచ్చెక్కిస్తున్న విజయ్ దేవరకొండ హీరోయిన్...

బాలీవుడ్ ప్రముఖ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే గత ఏడాది బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహించినటువంటి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు హీరోయిన్ పరిచయమైన సంగతి అందరికీ తెలిసిందే.అయితే తే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో వెనువెంటనే రెండు చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది అనన్య.

 Ananya Pandey, Fighter Movie, Tollywood, Bollywood Heroine, Yoga Photos,-TeluguStop.com

కాగా ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలతో అభిమానులకు అందాల విందు చేస్తుంది.

తాజాగా అనన్య పాండే ఓ ప్రముఖ మ్యాగ్ జైన్ సంస్థ నిర్వహించినటువంటి ఫోటోషూట్ కార్యక్రమంలో అనన్య పాండే పాల్గొంది.

 Ananya Pandey, Fighter Movie, Tollywood, Bollywood Heroine, Yoga Photos,-యో-TeluguStop.com

ఇందులో భాగంగా స్కిన్ టైట్ నల్లటి దుస్తులు ధరించి యోగా చేస్తూ తన హాట్ హాట్ అందాలతో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.అంతేగాక ఈ ఫోటోలని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.

దీంతో కొందరు నెటిజన్లు అనన్య పాండే ఈజ్ బ్యూటిఫుల్ అంటూ తెగ  కామెంట్లు చేస్తున్నారు.అంతేకాక ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన 19 గంటల లోపే ఒక లక్షా అరవై వేల పై చిలుకు లైకులు వచ్చాయి.

అయితే ఇప్పటివరకు అనన్య పాండే ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 1 కోటి 20 లక్షల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనన్య పాండే తెలుగులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఫైటర్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రంలో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు.కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించినటువంటి షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube