టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య కొట్లాట... నలుగురు పరిస్థితి విషమం  

Fight Between Tdp And Ysrcp Cadre-ap Police,ap Politics,cadre

ఏపీలో ఈ మధ్య కాలంలో అధికార పార్టీ తమ ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద దాడులకి తెగబడింది.ప్రత్యక్షంగా, పరోక్షంగా విపక్షాలని బెదిరించడం, భయపెట్టడం అధికార పార్టీ నేతలు చేస్తున్నారు.వారికి భయపడి రాయలసీమ ప్రాంతాలలో కొంత మంది సొంత ఊళ్లు విడిచి పెట్టి బయటి ప్రాంతాలకి వెళ్లిపోతున్నారు.ఈ దాడులు, ప్రతి దాడులకి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

Fight Between Tdp And Ysrcp Cadre-ap Police,ap Politics,cadre తాజా తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ..ఎలక్షన్ రిజల్ట్స్ విశ్లేషణలు ,రాజకీయ నాయకుల వివరాలు ..కధనాలు -Fight Between Tdp And YSRCP Cadre-Ap Police Ap Politics Cadre

ఆ మధ్య శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన కొట్లాటలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.ఇదిలా ఉంటే మళ్ళీ అదే జిల్లాలో ఎల్.ఎన్.పేట మండలంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం భౌతికదాడులకు తెగబడ్డారు.

సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ జరిగిన నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య వివాదం తలెత్తింది.దీంతో ఇరు పార్టీల నేతలు కుర్చీలతో పరస్పరం దాడి చేసుకున్నారు.దాంతో పాటు కర్రలతో కొట్టుకున్నారు.ఈ దాడిలో పదిమంది తీవ్రంగా గాయపడగా వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.

గాయపడిన వారందరినీ స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రెండు వర్గాల వారిని అదుపు చేశారు.రెండు వర్గాల ఫిర్యాదులతో కేసులు నమోదు చేశారు.