కరువు ' పై కలిసి పోరాటం ! వార్ మొదలెట్టనున్న టీడీపీ జనసేన 

ఇప్పటికీ ఏపీలో పొత్తు పెట్టుకున్న టిడిపి జనసేన ( TDP Janasena )ఉమ్మడిగా వైసిపి ప్రభుత్వం పై పోరాడేందుకు సిద్ధమయ్యాయి.

ఇప్పటికే రెండు పార్టీలు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లే విధంగా నిర్ణయం తీసుకున్నారు.

దీనిలో భాగంగానే వైసిపి ప్రభుత్వంపై పోరాడేందుకు తొలి ఉమ్మడి కార్యాచరణగా ఏపీలో కరువు పరిస్థితులపై పోరాడాలని నిర్ణయించుకున్నాయి.ఏపీవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో లక్షల ఎకరాలు పంటలు దెబ్బతిన్నాయి.

అయితే వైసిపి ప్రభుత్వం కరువు నష్టం అంచనాలో విఫలం అయిందని , దాదాపు 500 మండలాల్లో కరువు ప్రభావం తీవ్రంగా ఉన్నా,  కేవలం 14 మండలాల్లో మాత్రమే కరువు ఉందని చెబుతుండడంతో దీనిపైనే పోరాటం చేసి రైతుల మద్దతు కూడగట్టాలని నిర్ణయించుకున్నాయి.ఏపీ వ్యాప్తంగా 32% లోటు వర్ష పాతం నమోదు కావడం,  గత రెండు నెలలుగా సరైన వర్షపాతం  నమోదు కాకపోవడంతో,  వరి పంటలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి.

రైతులు తీవ్రంగా నష్టాన్ని చవి చూశారు.దీంతో ప్రభుత్వ సాయం కోసం చాలామంది రైతులు( Farmers ) ఎదురుచూస్తున్నారు.అయితే ఈ విషయంలో వైసిపి ప్రభుత్వం పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తోందని,  ఈ రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి.

Advertisement

రైతు భరోసా రూపంలో ప్రభుత్వం సాయాన్ని అందిస్తున్నాం కనుక , పరిహారం ఇవ్వక్కర్లేదు అన్న రీతిలో సీఎం జగన్ ( CM jagan )ఉన్నట్లుగా ఈ రెండు పార్టీలు అభిప్రాయపడుతున్నాయి .కొద్దిరోజుల క్రితం ఏపీ క్యాబినెట్ సమావేశం నిర్వహించినా,  దాంట్లో కరువు అంశంపై చర్చించకపోవడాన్ని ఈ రెండు పార్టీలు ఇప్పటికే విమర్శించాయి.అయినా ఏపీ ప్రభుత్వం మాత్రమే ఈ విషయంలో పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తోంది అని టీడీపీ జనసేన ఆరోపణలు చేస్తున్నాయి.

దీంతో ఏపీలో కరువు అంశంపై రైతులకు మేలు జరిగే విధంగా వైసీపీ ప్రభుత్వం పోరాటం చేయాలని ఈ రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి.పంట నష్టపోయిన ప్రతి రైతుకు సబ్సిడీ రూపంలో పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ , జనసేన టిడిపిలో ఉమ్మడిగా ఉద్యమాన్ని మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి .

 విజయవాడలో రెండు పార్టీల జేఏసీ ప్రతినిధుల సమావేశం లో దీనిపై నిర్ణయం తీసుకున్నారు .ఈ మేరకు ఈనెల 14 ,15 ,16 తేదీల్లో నియోజకవర్గాల స్థాయిలో టిడిపి ,జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాయి.అక్కడ కూడా నియోజకవర్గలవారిగా కరువు పరిస్థితులపై పోరాటం చేయడానికి సంబంధించిన వ్యూహ రచన చేయాలని రెండు పార్టీలు నాయకత్వాలు నిర్ణయించాయి.

  ఈ విధంగా రైతుల మద్దతు కూడగట్టే విధంగా రెండు పార్టీలు పోరాటం మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు