చిరంజీవి బాలయ్యకు తేడా అదే.. ఫైట్ మాస్టర్స్ కామెంట్స్ వైరల్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఒకప్పుడు విపరీతమైన పోటీ ఉండేదనే సంగతి తెలిసిందే.బాలయ్య చిరంజీవి పోటీలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడగా కొన్నిసార్లు చిరంజీవి పై చేయి సాధిస్తే మరి కొన్నిసార్లు బాలయ్య పైచేయి సాధించారు.

 Fight Masteres Ram Laxman Comments About Chiranjeevi And Balayya, Balakrishna, C-TeluguStop.com

టాలీవుడ్ లో వందల సంఖ్యలో సినిమాలకు ఫైట్ మాస్టర్లుగా పని చేసిన రామ్ లక్ష్మణ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి, బాలకృష్ణ గురించి కీలక విషయాలను చెప్పుకొచ్చారు.

స్టార్ హీరో బాలకృష్ణ రియల్ డేరింగ్ హీరో అని రామ్ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.

డూప్ అవసరం లేకుండనే బాలకృష్ణ రంగంలోకి దిగుతారని రామ్ లక్ష్మణ్ తెలిపారు.ఫైట్ సీక్వెన్స్ చెప్పిన వెంటనే బాలకృష్ణ ముందుకు వచ్చి ఫైట్ సీక్వెన్స్ చేస్తారని రామ్ లక్ష్మణ్ వెల్లడించారు.

బాలయ్య ఏ మాత్రం భయపడకుండా ఫైట్ సీన్లు చేస్తారని తమకు మాత్రం భయం వేస్తుందని రామ్ లక్ష్మణ్ వెల్లడించారు.

Telugu Balakrishna, Chiranjeevi, Masters, Ram Laxman-Movie

లెజెండ్ లో రైలు సన్నివేశం తెరకెక్కించే సమయంలో తమకు గుండె జారిపోయిందని బాలయ్య మాత్రం బెదరకుండా ఆ సీన్లు చేశారని రామ్ లక్ష్మణ్ అన్నారు.బాలకృష్ణతో సినిమా చేసే సమయంలో భయం వేసినా ఆ తర్వాత బాలయ్య అభినయాన్ని చూసి ఆశ్చర్యపోతామని రామ్ లక్ష్మణ్ వెల్లడించారు.చిరంజీవితో కూడా తాము పని చేశామని చిరంజీవితో వర్క్ విషయంలో చాలా ఈజ్ ఉంటుందని రామ్ లక్ష్మణ్ అన్నారు.

బాలయ్య ప్రస్తుతం అఖండ సినిమాతో బిజీగా ఉంటే చిరంజీవి ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు.కొరటాల శివ ఆచార్య సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా బోయపాటి శ్రీను అఖండ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ ఏడాదే ఈ రెండు సినిమాలు రిలిజ్ కానుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube