పెళ్లిలో లొల్లి.. కోడి కూర తక్కువైందని కొట్టుకున్న బంధువులు!  

Fight For Chicken Curry In Srikakulam Marriage - Telugu Chicken Curry, Marriage, Srikakulam News, Viral News, Weird News

సాధారణంగా పెళ్లి వేడుకలో మర్యాదలు తక్కువయ్యాయని బంధువులు గొడవకు దిగడం మనం చూస్తుంటాం.కానీ ఓ పెళ్లి వేడుకలో భోజనం విషయంలో చెలరేగిన వివాదం కాస్త పెద్ద గొడవకు దారి తీసింది.

Fight For Chicken Curry In Srikakulam Marriage

శ్రీకాకుళం జిల్లాలోని సారవకోట మండల కేంద్రంలోని రెల్లివీధిలో జరిగిన ఓ పెళ్లి వేడుక రక్తసిక్తంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, పెళ్లి భోజనాల వద్ద చికెన్ కూర కోసం వధువు, వరుడు బంధువులు గొడవకు దిగారు.

రెల్లివీధికి చెందిన కూన సురేష్ అనే యువకుడికి బూర్జ మండలం ఉప్పినివలస గ్రామానికి చెందిన సవలాపురం నందినితో బుధవారం వివాహం జరగాల్సి ఉంది.ఈ క్రమంలో ఏర్పాటు చేసిన భోజనం విందులో తనకు చికెన్ కూర తక్కువగా వేశారని, మళ్లీ వేయాల్సిందిగా అమ్మాయి తరఫు బంధువు ఒకరు గొడవకు దిగారు.

కాగా చికెన్ కూర తక్కువగా ఉండటం, అప్పటికే అతడి ప్లేట్‌లో చికెన్ కూర ఉండటంతో, ముందు ఉన్న కూర తినాలని భోజనం వడ్డించే వారు అన్నారు.

దీంతో అమ్మాయి తరఫు వాళ్లు గొడవకు దిగడంతో ఇరువర్గాల వారు కర్రలతో కొట్టుకున్నారు.

ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టారు.

ఇరు వర్గాల బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

#Marriage #Chicken Curry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Fight For Chicken Curry In Srikakulam Marriage Related Telugu News,Photos/Pics,Images..