కొట్టుకోనున్న హీరోలు.. అదిపోతుందన్న డైరెక్టర్!  

Fight Between Ntr Ram Charan To Be Highlight - Telugu Ntr, Rajamouli, Ram Charan, Rrr, Telugu Movie News

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ భరతం పట్టేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడు.

 Fight Between Ntr Ram Charan To Be Highlight

ఇక ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విధ్వంసకర రికార్డులు సృష్టిస్తుందా అని అంచనాలు వేస్తున్నారు సినీ విశ్లేషకులు.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను ఉగాది కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

కొట్టుకోనున్న హీరోలు.. అదిపోతుందన్న డైరెక్టర్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ పోస్టర్‌లో నిప్పుగా చరణ్‌ను, నీరుగా తారక్‌ను చూపించారు.అయితే వీరిద్దరికీ సంబంధించి సినిమాలో ఓ అద్భుతమైన ఫైట్ ఉంటుందట.

ఈ ఫైట్‌లో తారక్-చరణ్‌లు ఒకరినొకరు ఢీకొడతారు.ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకుపోనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, తారక్ కొమురం భీం పాత్రలో కనిపిస్తాడు.ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, ఆలియా భట్, ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాను జనవరి 8, 2021లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు