బిగ్‌బాస్‌ : ఒక్క రోజు కూడా నిజాయితితో గేమ్ ఆడట్లేదు  

fight between noel and kumar sai in telugu biggboss 4 Telugu Big Boss 4, Noel, Kumar Sai, TVS Appache Task, Mehaboob, Sohel, Kumar Sai, Akhil - Telugu Akhil, Kumar Sai, Mehaboob, Noel, Sohel, Telugu Big Boss 4

బిగ్ బాస్ అంటేనే గొడవలు.కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉంటేనే రంజుగా ఉంటుంది.

TeluguStop.com - Fight Between Noel And Kumar Sai In Telugu Biggboss 4

అయితే కంటెస్టెంట్స్ చిన్న విషయాలకు గొడవ పడుతూ ఉంటే ప్రేక్షకులు కూడా లైట్‌ తీసుకుంటూ ఉంటారు.ఆ గొడవలు చాలా చిరాకును తెప్పిస్తాయి.

గొడవకు మంచి రీజన్‌ సాలిడ్‌ రీజన్‌ ఉండాలి.కాని నిన్న జరిగిన గొడవ మరీ చీప్ గా ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

TeluguStop.com - బిగ్‌బాస్‌ : ఒక్క రోజు కూడా నిజాయితితో గేమ్ ఆడట్లేదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కుమార్ సాయిని అనవసరంగా నోయల్‌ తప్పుబట్టడం జరిగింది.ఆ సందర్భంతో నోయల్ పై ఉన్న గౌరవం మరియు అభిమానం చాలా మందికి తగ్గుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంతకు ఏం జరిగిందంటే.నిన్నటి ఎపిసోడ్‌ లో టీవీఎస్ అపాచీ టాస్క్ లో భాగంగా మొదటి రౌండ్లో ఇంటి సభ్యులందరూ పుషప్స్ చేయాల్సి ఉంది.

ఎక్కువ సమయం చేసిన టాప్ ఫైవ్ మెంబర్స్ ని ఎంపిక చేసి 2వ రౌండ్‌ కు పంపిస్తారు. టాప్ ఫైవ్ లో మెహబూబ్, సోహెల్, కుమార్ సాయి, అఖిల్‌ మరియు నోయల్‌ వచ్చారు.

ఆ సమయంలోనే తన కంటే ఎక్కువ పుషప్స్‌ తీశాడు అంటూ కుమార్ సాయిని అంతా అభినందిస్తూ ఉండడంతో నోయల్‌ కు కోపం వచ్చి తట్టుకోలేకపోయాడు.అతడు గ్యాప్ తీసుకొని ఆగి ఆగి మరీ చేశాడని అలా చేస్తే నేను డబుల్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

నిజాయితీగా ఆడటం లేదంటూ కూడా అసహనం వ్యక్తం చేశాడు.తన విషయంలో నోయల్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వివరణ ఇచ్చేందుకు కుమార్‌ సాయి ప్రయత్నించిన సమయంలో ఒక్కరోజైనా నిజాయితీగా ఆడు అంటూ నోయల్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

దానికి కుమార్ సాయి స్పందిస్తూ తాను అయితే అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండను అంటూ గొడవని ముగించే ప్రయత్నం చేశాడు.అయితే నోయల్ మాత్రం ఆ గొడవని దృష్టిలో పెట్టుకుని తదుపరి రౌండ్లో ఆడేందుకు నో చెప్పాడు.

కుమార్ సాయి ఈ విషయంలో నోయల్‌ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం కరెక్ట్ కాదని ప్రేక్షకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక నోయల్‌ తప్పుకోవడంతో ఆ టాస్క్ ను అవినాష్ పూర్తి చేశాడు.

నిన్నటి ఆ టాస్క్ లో విజేతగా మెహబూబ్ నిలిచాడు.

#Noel #Sohel #Akhil #Mehaboob #Kumar Sai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Fight Between Noel And Kumar Sai In Telugu Biggboss 4 Related Telugu News,Photos/Pics,Images..