త్రివిక్రమ్ సినిమా కోసం పోటీలో గురుశిష్యులు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది.

 Fight Between Mani Sharma And Devi Sri Prasad For Trivikram Movie-TeluguStop.com

జులై, ఆగష్టులో సినిమా ప్రారంభించే అవకాశం ఉంది.సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు ప్రముఖంగా వినిపిస్తుంది, అలాగే రష్మికని కూడా పరిశీలిస్తున్నారు.

నిధి అగర్వాల్ ని సెకండ్ లీడ్ గా కన్ఫర్మ్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు స్పై గా రాఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడని టాక్ నడుస్తుంది.

 Fight Between Mani Sharma And Devi Sri Prasad For Trivikram Movie-త్రివిక్రమ్ సినిమా కోసం పోటీలో గురుశిష్యులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదటి సారి ఈ సినిమా కోసం డిఫరెంట్ జోనర్ ట్రై చేస్తున్నాడని సమాచారం.ఫ్యామిలీ ఎలిమెంట్స్ కనెక్ట్ చేస్తూనే స్పై ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథాంశం ఇందులో చెప్పబోతున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే త్రివిక్రమ్ తన సినిమాల కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా రెండు మూడు సినిమాల వరకు కంటెన్యూ చేస్తూ ఉంటాడు.ఆరంభంలో దేవిశ్రీప్రసాద్ గా ఎక్కువగా వర్క్ చేశాడు.

తరువాత అరవింద సమెంత, అల వైకుంఠపురంలో సినిమాలకి తమన్ ని తీసుకున్నాడు.దీంతో దేవిశ్రీ ప్రసాద్ కి త్రివిక్రమ్ కి చెడిందని ఈ కారణంగానే తమన్ కి అవకాశం ఇచ్చాడని టాక్ వచ్చింది.అయితే ఇప్పుడు మహేష్ సినిమా కోసం ముందుగా తమన్ అనుకున్న తరువాత మణిశర్మ ఫ్రేమ్ లోకి వచ్చారు.మణిశర్మ, మహేష్ బాబు కాంబోలో సూపర్ హిట్స్ చాలా ఉన్నాయి.

ఈ నేపధ్యంలో మహేష్ కూడా మణిశర్మకి ఒకే చెప్పినట్లు టాక్ నడిచింది.అయితే ఇప్పుడు లైన్ లోకి దేవిశ్రీ ప్రసాద్ పేరు కూడా వచ్చింది.

మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్ లలో ఒకరిని తీసుకోవడం మాత్రం పక్కా అని తెలుస్తుంది.దేవిశ్రీతో త్రివిక్రమ్ కి మంచి సింక్ ఉంది ఈ నేపధ్యంలో అతనితో మళ్ళీ వర్క్ చేయడానికి గురూజీ రెడీ అయినట్లు టాక్.

మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్ గురు శిష్యులు అనే విషయం తెలిసిందే.మరి వీరిద్దరిలో ఫైనల్ గా త్రివిక్రమ్ ఎవరి వైపు మొగ్గు చూపిస్తాడనేది చూడాలి.

#Mani Sharma #Devi Sri Prasad #FightBetween #SuperStar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు