దుష్ప్రచారం చేస్తున్నాడని దాడికి దిగిన స్నేహితులు..!  

Fight Between Friends in Hyderabad, Hyderabad, Fight,Police Complaint - Telugu Fight, Fight Between Friends In Hyderabad, Friends, Hyderabad, Police Complaint

స్నేహితుల మధ్య ఘర్షణ పలువురికి గాయాల పాలు చేసింది.బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటూ వాళ్ల మధ్య వచ్చిన స్వల్ప వివాదాలు, స్నేహితుల మధ్య దుష్ప్రచారాలు చేయడం వల్ల నెలకొన్న సమస్య వాగ్వాదానికి దారితీసింది.

TeluguStop.com - Fight Between Friends Spreading False News

సమస్యను పరిష్కరించుకుందామని కలిసి ఇరు వర్గాల స్నేహితులు దాడికి దిగడంతో తీవ్ర గాయల పాలయ్యారు.విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించి, ఇరువర్గాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

ఇరు వర్గాల స్నేహితులు గొడవలు పడి గాయాలు పడిన ఘటన హైదరాబాద్ లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

TeluguStop.com - దుష్ప్రచారం చేస్తున్నాడని దాడికి దిగిన స్నేహితులు..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంద్రనగర్ లో గత రాత్రి ఇద్దరు స్నేహితుల మధ్య చిన్న పాటి వివాదం నెలకొంది.అది గొడవకు దారి తీసిందన్నారు.

గత కొద్ది రోజులుగా ఆకాశ్, శుభం అనే ఇద్దరు స్నేహితులు ఒకరిపై ఒకరు దుష్ర్పచారాలు చేసుకుంటున్నారు.ఈ క్రమంలో ఇద్దరు కలిసి మాట్లాడుకుందామని ఇందిరానగర్ లో ఉంటున్న ఆకాశ్ ఇంటి శుభం తన స్నేహితులతో కలిసి వెళ్లాడు.

మాట్లాడుతున్నప్పుడు మాట మాట పెరిగి దాడికి దిగారు.ఈ దాడిలో ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.

కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.

#FightBetween #Fight #Friends #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Fight Between Friends Spreading False News Related Telugu News,Photos/Pics,Images..