న‌డిరోడ్డు మీద కోబ్రా, రాకాసి బ‌ల్లి మ‌ధ్య‌ భీక‌ర ఫైట్‌.. గెలిచిందెవ‌రంటే..?

అడవిలో జంతువుల మధ్య భీకర పోరుకు సంబంధించిన బోలెడన్ని వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.అవి చూసి నెటిజన్లు భయపడిపోతుంటారు.

 Fight Between Cobra And Rakasi Bally On Nadi Road .. Who Won, Viral Video , Vir-TeluguStop.com

అయితే, అడవిలో పోరాడి జయించిన జంతువులే జీవించగలుగుతాయన్న నియమం ఉంటుందన్న సంగతిని గుర్తిస్తారు.క్రూర జంతువుల నుంచి తప్పించుకునేందుకు సాధు జంతువులు ప్రయత్నిస్తూనే ఉంటాయి.

తెలివిగా వాటి బారిన పడకుండా ఉండేందుకు ఆరాటపడుతుంటాయి.కాగా తాజాగా జంతువుల మధ్య జరిగిన భీకర ఫైట్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది.

ఇంతకీ సదరు వీడియోలో ఉన్న జంతువులు ఏంటంటే.

పాములను చూస్తే ఎంతటి జంతువులైనా ఒక్కోసారి భయపడిపోతుంటాయి.

మనుషులు అయితే అసలు వాటిని చూస్తేనే చాలు అటు వైపునకు వెళ్లకుండా జాగ్రత్తపడుతుంటారు.ఓ వైపున వాటిని పూజిస్తూనే భయపడిపోతుంటారు.

ఇకపోతే కింగ్ కోబ్రా.అత్యంత విషపూరితమైన సరీసృపమన్న సంగతి అందరికీ తెలిసిందే.

కింగ్ కోబ్రాను చూస్తే చాలు ఎంతటి క్రూర జంతువైనా భయపడిపోతుంది.అటువంటిది ఈ కింగ్ కోబ్రాతో ఓ రాకాసి బల్లి భీకర ఫైట్ చేసింది.

ప్రాణాలకు తెగించి మరీ రాకాసి బల్లి కింగ్ కోబ్రాతో భీకర పోరు జరిపింది.ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని మలయట్టూర్ అటవీ ప్రాంతంలో జరగగా, అటవీ శాఖ అధికారులు రికార్డు చేసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో వదలారు.

అది కాస్తా ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.సదరు వైరల్ వీడియోలో కింగ్ కోబ్రా చాలాసార్లు రాకాసి బల్లిని కాటేసేందుకు ప్రయత్నించడం మనం చూడొచ్చు.అయితే, ప్రతీ సారి రాకాసి బల్లి కాటు నుంచి తప్పించుకుని మళ్లీ కింగ్ కోబ్రాపై ఎదురుదాడకి దిగుతోంది.ఇలా దాదాపు పది నిమిషాల పాటు వీటి మధ్య ఫైట్ జరిగింది.

చివరికి ఎవరు నెగ్గుతారో అని అందరు అనుకునే లోపు అవి చెరోదారిన వెళ్లిపోయాయి.పాము పొదల్లోకి వెళ్లగా, రాకాసి బల్లి మరో వైపునకు వెళ్లిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube