బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యే పోరు ! మరి బిజెపి ?

తెలంగాణలో ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండడంతో, అన్ని పార్టీలు పూర్తిగా ఎన్నికల వ్యవహారాల్లోనే మునిగిపోయాయి.ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్, బిజెపిలు పోటీ పడుతున్నాయి.

 Fight Between Brs Congress! And Bjp, Telangana, Bjp, Congress, Brs, Brs Governme-TeluguStop.com

ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి చెందడంతో ఆ ప్రభావం తెలంగాణలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.కాంగ్రెస్ లో కర్ణాటక ఎన్నికల( Karnataka Elections ) ఫలితాల ఉత్సాహం కనిపిస్తోంది.

కాంగ్రెస్ లోకి చేరికలు కనిపిస్తున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ( BRS )లో కీలకంగా పనిచేసిన నేతలంతా కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

దీంతో తెలంగాణలో బీఆర్ఎస్, బిజెపి మధ్య ప్రధాన పోటీ ఉంటుంది అని ముందుగా అందరూ అంచనా వేసినా, ఇప్పుడు బిజెపి స్థానాన్ని కాంగ్రెస్ ఆక్రమించింది.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ అన్నట్లుగా పరిస్థితి తయారయింది.

తెలంగాణ బిజెపిలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, కీలక నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, అప్పుడే సీఎం సీటు విషయంలో పోటీ పడుతున్న పరిస్థితి తెలంగాణ బిజెపిలో కనిపిస్తూ ఉండడం, చేరికలు కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల రాజేందర్ ( Etela Rajender )కు వ్యతిరేకంగా మరో వర్గం పావులు కదుపుతూ ఉండడం, రాజేందర్ ఇతర పార్టీలోని కీలక నాయకులను చేర్చుకునేందుకు వారితో చర్చలు జరుపుతున్న విషయాన్ని కొంతమంది తెలంగాణ బిజెపి కీలక నాయకులు బయటకు లిక్ చేయడం , తద్వారా ఆ చేరికలు నిలిచిపోవడం, రాజేందర్ కు క్రెడిట్ రాకుండా చేసే వ్యూహంలో భాగంగానే ఈ వ్యవహారాలు చోటు చేసుకోవడం ఇవన్నీ తెలంగాణ బిజెపికి ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నాయి.

Telugu Bandi Sanjay, Brs, Central, Congress, Etela Rajendar, Telangana, Telangan

ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) దూకుడుగా వ్యవహరిస్తున్నారు.బీఆర్ఎస్ వ్యవహారాలను కట్టడి చేసే విధంగా ఎప్పటికప్పుడు ప్రజా పోరాటాలు చేస్తూ, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నారు.కానీ బిజెపి లో ఆ తరహా ఏక అభిప్రాయం కనిపించడం లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై బిజెపి పోరాటాలు చేస్తున్నా, అవి ప్రజల్లోకి వెళ్లకపోవడం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై జనాల్లోనూ వ్యతిరేకత కనిపిస్తుండడం ఇవన్నీ తెలంగాణ బిజెపిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

అంతే కాకుండా బీఆర్ఎస్, బిజెపిలు( BRS , BJP ) ఒకటే అనే ప్రచారాన్ని కాంగ్రెస్ ఈ మధ్యకాలంలో ఉదృతం చేయడం ,దీనిపై జనాల్లోనూ చర్చ జరుగుతుండడంతో, కాంగ్రెస్ కు ఇవన్నీ కలిసి వస్తున్నాయి.

Telugu Bandi Sanjay, Brs, Central, Congress, Etela Rajendar, Telangana, Telangan

బిజెపి తెలంగాణలో ఎన్నికల వ్యవహారాలను ముందుగానే అమలు చేస్తున్న, అంతగా కలిసి రావడం లేదనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి.అయితే బిజెపి అధిష్టానం తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది.దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పు, చేర్పులు చేస్తూ, పార్టీ నాయకులు జనాల్లో ఉండే విధంగా బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న అంతగా కలిసి రావడంలేదనే విధంగానే పరిస్థితులు నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube