నోయ‌ల్, మాస్ట‌ర్ మ‌ధ్య చిచ్చు పెట్టిన అభిజిత్.. ?  

fight between amma rajasekhar and noel in bigg boss 4! fight, amma rajasekhar, noel, bigg boss 4, bigg boss telugu, abhijeet, bigg boss tasks - Telugu Abhijeet, Amma Rajasekhar, Bigg Boss 4, Bigg Boss Tasks, Bigg Boss Telugu, Fight, Noel

బుల్లితెర అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్‌లో ఏడో వారం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.కొత్త కొత్త టాస్క్‌లు, గొడ‌వ‌లు, ల‌వ్ ట్రాకులు బిగ్ బాస్ హౌస్‌ను హీటెక్కిస్తున్నాయి.

TeluguStop.com - Fight Between Amma Rajasekhar And Noel In Bigg Boss 4

ఇంటి స‌భ్యులు ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌కుండా త‌మ‌దైన శైలిలో ఆట ఆడుతూ‌ పోటీ పడుతున్నారు.ఇక నిన్న‌టి ఎపిసోడ్‌లో కొంటె రాక్షసులు.

మంచి మనుషులు టాస్క్‌లో బెస్ట్ పెర్ఫామర్స్ అయిన అవినాష్‌, అరియానాల‌కు బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు.

TeluguStop.com - నోయ‌ల్, మాస్ట‌ర్ మ‌ధ్య చిచ్చు పెట్టిన అభిజిత్.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ టాస్క్‌లో అవినాష్ విజ‌యం సాధించి.

కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.ఇక నిన్న‌టి ఎపిసోడ్‌లోనే నోయ‌ల్, అమ్మ రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య చిచ్చు పెట్టాడు అభిజిత్.

నోయ‌ల్ మిమ్మ‌ల్ని నామినేట్ చేసిన‌ప్పుడు ఎలా ఫీల్‌ అయ్యార‌ని అభిజిత్ అమ్మ రాజ‌శేఖ‌ర్‌ మాస్ట‌ర్‌ను ప్ర‌శ్నించాడు.అయితే కూల్‌గా మొద‌లైన ఈ టాపిక్‌.

చివ‌ర‌కు ఎక్క‌డికో వెళ్లి నోయ‌ల్‌, మాస్ట‌ర్ మ‌ధ్య గొడ‌వ‌కు దారి తీసింది.

త‌న సినిమాకు ర్యాప్ సాంగ్ రాసివ్వ‌మ‌ని అడిగాను.

నీవు చేయ‌లేద‌ని నోయ‌ల్‌పై ఫైర్ అయిన మాస్ట‌ర్ అంత‌లోనే మాట మార్చి.నీవు రాశావు.

కానీ, అది స‌రిగ్గా లేదు.అంద‌రికీ అర్థం అయ్యేలా రాయ‌మ‌ని అడిగాను.

అందుకు నువ్వు ఓకే చెప్పి.చివ‌ర‌కు రాయ‌లేదంటూ దూషించాడు.

దీనికి నోయ‌ల్ తాను సాంగ్ ఇచ్చాన‌ని, అది రిలీజ్ కూడా అయింద‌ని చెప్పుకొచ్చాడు.

అందుకు డ‌బ్బులు కూడా ఇవ్వ‌లేద‌ని.

అయిన‌ప్ప‌టికీ దాని గురించి నేను ప‌శ్నించ‌లేద‌ని స్ప‌ష్టం చేశాడు నోయ‌ల్‌.దీంతో మాస్ట‌ర్.

కెమెరా కోసం డైలాగులు చెప్తావు, ప్రామిస్ మీద నిల‌బ‌డే క్యారెక్ట‌ర్ కాదు నీది అంటూ ఎప్ప‌టిలాగానే వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశాడు ఇక మాస్ట‌ర్ అన్న మాట‌ల‌కు మూడౌట్ అయిన నోయ‌ల్‌.ఇప్పుడు సంతోషంగా ఉందా అంటూ ఆ చిరాకు అభిపై చూపించారు.

మొత్తానికి అభి నామినేష‌న్ గురించి అడిగినందుకు.మాస్ట‌ర్ ఎక్క‌డికో వెళ్లిపోయి ర‌చ్చ ర‌చ్చ చేశాడు.

#Fight #Amma Rajasekhar #Bigg Boss Tasks #Noel #Abhijeet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Fight Between Amma Rajasekhar And Noel In Bigg Boss 4 Related Telugu News,Photos/Pics,Images..