బిగ్‌ బాస్‌ : మైండ్‌ గేమ్‌తో హారికను ఏడిపించిన అభిజిత్‌

బిగ్‌ బాస్‌ ఈ వారం ఇంటి సభ్యులకు ఇచ్చిన బిబి హోటల్‌ టాస్క్‌ రసాబాసగా మారిపోయింది.అతిథులు ఇవ్వాల్సిన స్టార్స్‌ ను ముందే అభిజిత్‌ తన మైండ్‌ గేమ్‌ తో దగ్గర పెట్టుకున్నాడు.

 Fight Between Abhijit And Harika In Bb Hotel Task , Bb Hotel Task, Bigg Boss4, A-TeluguStop.com

రోబో టాస్క్‌ లో భాగంగా దివిని మెల్లగా లోనికి తీసుకు వెళ్లినట్లుగానే ఈసారి తనదైన తెలివితో ధనవంతుల టీంకు చెందిన హారిక టీం నుండి అభిజిత్‌ స్టార్స్‌ దక్కించుకున్నాడు.ఈ స్టార్స్‌ వల్ల హోటల్‌ సిబ్బంది టీం గెలిచే అవకాశం ఉంది.

హారిక చేతి నుండి ఆ స్టార్స్‌ వచ్చిన కారణంగా టెక్నికల్‌ గా చూస్తే అభిజిత్‌ టీం గెలిచినట్లే అవుతుంది.తనను బురిడి కొట్టించి అభిజిత్‌ తన నుండి స్టార్స్‌ తీసుకున్నాడని తెలుసుకున్న హారిక అవాక్కయ్యింది.

ఆతర్వాత కన్నీరు కూడా పెట్టుకుంది.

బిగ్‌బాస్‌ కు మళ్లీ మళ్లీ రిక్వెస్ట్‌ చేసింది.

తాను ఒకే స్టార్‌ ఇచ్చాను.మిగిలిన స్టార్స్‌ మాత్రం నేను ఇవ్వలేదు అంటూ హారిక చెప్పింది.

హారిక చెప్పిన దాని ప్రకారం బిగ్‌బాస్‌ తుది నిర్ణయం ఉంటుందా లేద అభిజిత్‌ మైండ్‌ గేమ్‌ ను అభినందించి గేమ్‌లో హోటల్‌ సిబ్బంది గెలిచినట్లుగా ప్రకటిస్తారా అనేది నేటి ఎపిసోడ్‌ లో తేలిపోయే అవకాశం ఉంది.ఇప్పటికే అభిజిత్‌ను అమ్మాయిలను అడ్డు పెట్టుకుని ఆడుతున్నావు అంటున్నారు.

ఇప్పుడు కనుక అభిజిత్‌ ఇలా గెలిస్తే మెహబూబ్‌ మరియు సోహెల్‌ లు నానా రచ్చ చేయడం కన్ఫర్మ్‌ అనిపిస్తుంది.బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో అయిదవ వారం మొదలైన టాస్క్‌ నేడు ముగిసే అవకాశం ఉంది.

ఈ టాస్క్‌ క్లైమాక్స్‌ ఎలా ఉంటుందా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఒక వేళ ఈ టాస్క్‌ లో అభిజిత్‌ టీం గెలిస్తే హారిక పెద్ద బకరా అయినట్లే.

ఇన్నాళ్లు చాల మంచి రిలేషన్‌ లో ఉన్న హారిక మరియు అభిజిత్‌ ల మద్య గొడవ తీవ్రం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube