అక్కడ రెండు చెట్లకు అంగరంగవైభవంగా పెళ్లి చేసారు.. అంతటితో ఆగకుండా గ్రాండుగా భోజనాలు కూడా పెట్టారు.. ఎందుకో తెలుసా?

పట్నాల సంగతి పెద్దగా చెప్పుకోనవసరం లేదు.పూర్వ ఆచార సంప్రదాయాలను మర్చిపోకుండా ఆచరించేది మాత్రం పల్లెటూళ్లలోనే.అవును… కొన్ని పల్లెల్లో ఆచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇటివంటి సంప్రదాయాలను మనం చూడవచ్చును.

 Fig And Neem Tree Marriage Grandly Done By People In Tirupathi Details, Trees,-TeluguStop.com

ఇక ఆ సంప్రదాయం ఏమిటంటే, వేప చెట్టుకు.రావి చెట్టుకు పెళ్లి చేయడం.

అవును.అదేదో సింపుల్ గా చేయడం కాదు.

అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు ఆ ఊరి పెద్దలు.అక్కడితో ఆగకుండా ఊరంతా విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు.

ఈ ఘటన తాజాగా చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో చోటు చేసుకోవడం విశేషం.తిరుపతి రూరల్ సమీపంలోని చిగురువాడకు చెందిన ముత్యాలయ్య, పద్మావతి దంపతులు.గత 11 ఏళ్ల నుంచి వీరు రావి, వేప చెట్టుకు పరంపరగా పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అలాగే వేడుకగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఇక వీరు పూజలతోనే సరిపెట్టలేదు.రావి, వేప చెట్లకు వివాహం చేస్తున్నామంటూ.

బంధుమిత్రలను ఇంటికి కార్డులు ఇచ్చి మరీ ఆహ్వానించారు.

ఇక ఈ వేడుకల్లో భాగంగా మనుషులకు చేసినట్టే.రావి, వేప చెట్లకు పట్టు వస్త్రాలు, కంకణాలు కట్టి నూతన వధూవరుల్లా ముస్తాబు చేశారు.సాధారణంగా మనుషుల పెళ్లిళ్లు ఎలా జరుగుతాయో, అలాగే ఇక్కడ చెట్లకు పెళ్లి చేయడం విశేషం.

అర్చకుడి వేదమంత్రాలు, అగ్ని సాక్షిగా హోమం నిర్వహించి వేప, రావి చెట్టుకు పెళ్లి జరిపించారు.వేప-రావి చెట్టు కలిసి ఉన్న చోట పందిళ్లు వేసి మంగళవాయిద్యాల మద్య మూడుముళ్లు వేయించి వేడుకగా పెళ్లి చేసారు.

అనంతరం విందు భోజనాలు ఏర్పాటు చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube